
Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, దాని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ లపై స్పష్టంగా కనిపిస్తోంది.
శుక్రవారం ఉదయం మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 591 పాయింట్లు పడిపోయి 79,743 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 210 పాయింట్ల నష్టంతో 24,063 వద్ద కొనసాగుతోంది.
రూపాయి మారకం విలువ కూడా డాలర్‌తో పోలిస్తే 30 పైసలు నష్టపోయి 85.88 వద్ద ఉంది.
లార్సెన్ అండ్ టుబ్రో, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నా, పవర్ గ్రిడ్, జియో ఫైనాన్షియల్, ట్రెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్స్ మాత్రం నష్టాల్లో ఉన్నాయి.
Details
పెట్టుబడిదారుల్లో ఆందోళన
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలున్నా దేశీయంగా మార్కెట్లు నెగటివ్‌గా స్పందించాయి. దీనికి ప్రధాన కారణం భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'పై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించడమే.
ఈ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడికి యత్నించింది. భారత సైన్యం, పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని కౌంటర్ దాడులకు దిగింది.
భారత రక్షణ వర్గాల ప్రకారం, లాహోర్‌లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఈ దాడుల్లో ధ్వంసమైంది.
ఈ యుద్ధ భయాల వాతావరణం మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతూ, పెట్టుబడిదారుల్లో ఆందోళనకు కారణమవుతోంది.