
India:2047 నాటికి భారతదేశం $23-$35 ట్రిలియన్ల GDPతో అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుంది: బెయిన్ అండ్ కంపెనీ,నాస్‌కామ్ నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వం 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన(వికసిత్ భారత్)దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అదే కాలానికి భారత్ అధిక ఆదాయ దేశంగా మారనుందని అంచనా.
ప్రముఖ అమెరికన్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ-నాస్‌కామ్ సంయుక్త నివేదిక ప్రకారం, భారతదేశ జీడీపీ 23-35 లక్షల కోట్ల డాలర్ల (రూ. 2000-3000 లక్షల కోట్ల) స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
కొత్తగా 20 కోట్ల మంది ఉద్యోగాల్లోకి..
2047 నాటికి భారత జీడీపీలో సేవల రంగం వాటా 60%, తయారీ రంగం 32% స్థాయికి చేరొచ్చని అంచనా.
ఈ రెండూ దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన బలమైన వనరులుగా మారనున్నాయి.
రాబోయే దశాబ్దాల్లో కొత్తగా 20 కోట్ల మంది ఉద్యోగాల్లోకి ప్రవేశించనున్నారు.
వివరాలు
ఇంటిగ్రేషన్, ఆధునాతన సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు
అధిక విలువ కలిగిన ఉద్యోగ అవకాశాలను పెంచుకునే దిశగా భారత్‌కి ఇదొక గోల్డెన్ ఛాన్స్.
ఏఐ ఆధారిత చిప్ డిజైన్, టచ్‌లెస్ తయారీ,బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్ వంటి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
2047 నాటికి ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల వాటా ప్రస్తుత 24% నుంచి 45-50% స్థాయికి పెరిగే అవకాశం ఉంది.జీడీపీలో ఈ రంగం ప్రస్తుత 3% నుంచి 8-10% స్థాయికి పెరుగుతుందని అంచనా.
పునరుత్పాదక ఇంధన విస్తరణ
భారతదేశ మొత్తం ఇంధన ఉత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వాటా 2023లో 24% ఉండగా,2047 నాటికి 70% స్థాయికి చేరనుంది. వాహన విడిభాగాల ఎగుమతి రంగం 200-250 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదుగుతుందని అంచనా.
వివరాలు
అభివృద్ధికి కీ రోల్స్ పోషించే రంగాలు
భారతదేశ వృద్ధికి ఎలక్ట్రానిక్స్, ఇంధనం, రసాయనాలు, ఆటోమోటివ్, సేవల రంగాలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఆదాయ పెరుగుదల, నైపుణ్య అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
స్థానిక తయారీపై అధిక ప్రాధాన్యత
స్థానిక ఉత్పత్తి పెరుగుతుండటంతో అనేక కీలకమైన విడిభాగాల కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.
కృత్రిమ మేధ (AI), హరిత ఇంధనం, R&D రంగాల్లో పెట్టుబడులు పెంచడం ద్వారా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై భారత్ ఆధారపడకుండా ముందుకు సాగే వీలుంటుంది.
సాంకేతికత, అంతర్జాతీయ భాగస్వామ్యాలను మెరుగుపరచడం, నైపుణ్య అంతరాలను తగ్గించడం, వినూత్నతను వేగవంతం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టడం భారతదేశ ఆర్థిక పురోగతికి మరింత ఉత్సాహాన్నిస్తుంది.