LOADING...
India's Export: ఎగుమతుల్లో భారత్‌ కొత్త చరిత్ర.. $863 బిలియన్ మైలురాయి
ఎగుమతుల్లో భారత్‌ కొత్త చరిత్ర.. $863 బిలియన్ మైలురాయి

India's Export: ఎగుమతుల్లో భారత్‌ కొత్త చరిత్ర.. $863 బిలియన్ మైలురాయి

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2026
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశం నుంచి ఎగుమతులు మరోసారి రికార్డు స్థాయిని తాకాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 863.11 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని డీజీసీఐఎస్‌,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది 825.26 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 4.59 శాతం వృద్ధి. ముఖ్యంగా ఈ ఏడాది నాలుగు క్వార్టర్లలోనూ ఎగుమతులు రికార్డు స్థాయిలో నమోదవడం ప్రత్యేకతగా నిలిచింది.

వివరాలు 

8.71 శాతం పెరుగుదల

అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత్‌ ఆర్థిక స్థిరత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ఈ వృద్ధికి ప్రధాన కారణం సేవల రంగం. ఐటీ, బిజినెస్ సేవలు, ప్రొఫెషనల్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో సేవల ఎగుమతులు 421.32 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఏడాది 387.55 బిలియన్ డాలర్లతో పోలిస్తే 8.71 శాతం పెరుగుదల నమోదైంది. మరోవైపు సరుకుల ఎగుమతులు మాత్రం స్వల్పంగా పెరిగి 441.78 బిలియన్ డాలర్లకు చేరాయి. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితుల ప్రభావం ఉన్నప్పటికీ స్థిరంగా వృద్ధి కొనసాగడం గమనార్హం. అయితే ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా పెరిగాయి. మొత్తం దిగుమతులు 979.65 బిలియన్ డాలర్లకు చేరి,ఎగుమతుల కంటే వేగంగా పెరిగాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు మరింత విస్తరించింది.

Advertisement