Loading...
World Bank Report: భారత్‌లో పేదరికం భారీగా తగ్గుదల.. 12 ఏళ్లలో 50 కోట్ల మందికి ఊరట!
భారత్‌లో పేదరికం భారీగా తగ్గుదల.. 12 ఏళ్లలో 50 కోట్ల మందికి ఊరట!

World Bank Report: భారత్‌లో పేదరికం భారీగా తగ్గుదల.. 12 ఏళ్లలో 50 కోట్ల మందికి ఊరట!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

పేదరిక నిర్మూలనలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. గత 12 ఏళ్లలో దేశంలో దాదాపు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తన తాజా నివేదికలో పేర్కొంది. 2011 నుంచి 2023 మధ్య కాలంలో ఈ మార్పు చోటుచేసుకుందని తెలిపింది. ఇదే సమయంలో తీవ్ర పేదరికం రేటు 27.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది.

వివరాలు 

పేదరికం గణాంకాల్లో భారీ మార్పు

ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన 'అక్టోబర్ 2026 ఇండియా పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్' నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.

రోజుకు 4.20 డాలర్లు (సుమారు రూ.350)కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న వారి సంఖ్య 2011లో దేశ జనాభాలో 57.7శాతంగా ఉండేది.

2023 నాటికి ఈ సంఖ్య 16.1 శాతానికి పడిపోయింది. అలాగే,రోజుకు 3 డాలర్లు (సుమారు రూ.250) కంటే తక్కువ ఆదాయంతో జీవించే వారిని తీవ్ర పేదరికంలో ఉన్నవారిగా పరిగణిస్తారు.

ఈ ప్రమాణం ప్రకారం 2011లో దేశ జనాభాలో 27.1శాతం మంది తీవ్ర పేదరికంలో ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 2.6శాతానికి తగ్గింది.

అంటే పేదరిక నిర్మూలనలో భారత్ గణనీయమైన ముందడుగు వేసినట్లు ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వివరించింది.

వివరాలు 

పేదరికం తగ్గడానికి కారణాలివే!

దేశంలో ప్రజల వినియోగవ్యయం పెరగడం,ఉపాధి అవకాశాలు మెరుగుపడటం ఈ మార్పునకు ప్రధాన కారణాలని ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది.

వీటితో పాటు ఆహార సబ్సిడీలు సహా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సామాజిక సంక్షేమ పథకాలు కూడా పేదరికం తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొంది.

ముఖ్యంగా 2017 నుంచి 2023 మధ్య దేశంలో కొత్తగా 13.4కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని నివేదిక వెల్లడించింది.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వేతనంతో కూడిన పనుల్లోకి రావడం ఈ ఉద్యోగాలకల్పనలో ముఖ్యమైన అంశంగా మారిందని తెలిపింది.

అయితే,కొత్తగా ఏర్పడిన ఉద్యోగాల్లో ఎక్కువ భాగం తక్కువ ఉత్పాదకత కలిగిన రంగాల్లోనే ఉన్నాయని పేర్కొంది.

దీంతో ఉద్యోగాలు పెరిగినప్పటికీ..కార్మికుల వాస్తవ వేతనాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో పెరుగుదల కనిపించలేదని వివరించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఆదాయ అసమానతలు ఇంకా ఎక్కువే!

దేశంలో పేదరికం గణనీయంగా తగ్గినప్పటికీ ఆదాయ అసమానతలు మాత్రం కొనసాగుతున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది.

అత్యధిక వేతనాలు పొందుతున్న మొదటి 10 శాతం మంది ఉద్యోగుల ఆదాయంతో పోలిస్తే.. అత్యల్ప వేతనాలు అందుకుంటున్న చివరి 10 శాతం మంది ఆదాయం 13 రెట్లు తక్కువగా ఉంది.

అంటే దేశంలో సంపద, ఆదాయ పంపిణీలో అంతరం ఇంకా గణనీయంగానే ఉన్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక పేదరికం

పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య కూడా పేదరిక రేటులో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది.

పట్టణ ప్రాంతాల్లో పేదరికం 8.6 శాతంగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 19.3 శాతంగా నమోదైంది.

పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

భవిష్యత్తులో పేదరికాన్ని మరింత తగ్గించాలంటే కేవలం ఉద్యోగాల సంఖ్య పెంచడమే కాకుండా.. మెరుగైన వేతనాలు అందించే నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.

ముఖ్యంగా వ్యవసాయేతర రంగాల్లో ఉత్పాదకతను పెంచడంతో పాటు, మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడంపై దృష్టి సారించాలని నివేదిక పేర్కొంది.

ADVERTISEMENT