Electric tractors: విద్యుత్తు ట్రాక్టర్లకు దేశంలో తొలి బీఐఎస్ పరీక్షా ప్రమాణాలు
ఈ వార్తాకథనం ఏంటి
విద్యుత్తు ట్రాక్టర్ల కోసం దేశంలోనే తొలి పరీక్షా ప్రమాణాన్ని భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) ప్రవేశపెట్టింది. ఐఎస్ 19262: 2025 - 'ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ ట్రాక్టర్స్-టెస్ట్ కోడ్' పేరుతో రూపొందించిన ఈ ప్రమాణాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విడుదల చేశారు. బీఐఎస్ రూపొందించిన ఈ కొత్త ప్రమాణం విద్యుత్తు ట్రాక్టర్ల భద్రత, విశ్వసనీయత, పనితీరును సమగ్రంగా అంచనా వేయడానికి అవసరమైన పరీక్షా నిబంధనలను నిర్దేశించింది. ఇందులో పవర్ టేక్-ఆఫ్ (పీటీఓ), డ్రాబార్ పవర్, బెల్ట్, పుల్లీ పనితీరు, వైబ్రేషన్ కొలతలు, భాగాలు, అసెంబ్లీల తనిఖీ వంటి కీలక పరీక్షలు పొందుపరిచారు.
Details
ప్రమాణాల ఆధారంగా టెస్ట్ కోడ్
వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ఉన్న సంప్రదాయ డీజిల్ ట్రాక్టర్లకు, అలాగే విద్యుత్ వాహనాల కోసం ఇప్పటికే అమల్లో ఉన్న ప్రమాణాలను ఆధారంగా తీసుకుని ఈ టెస్ట్ కోడ్‌ను రూపొందించారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖలోని యాంత్రీకరణ, సాంకేతిక విభాగం చేసిన విజ్ఞప్తి మేరకు, ట్రాక్టర్ తయారీదారులు, పరీక్షా సంస్థలు, పరిశోధనా సంస్థలు, సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో ఈ ప్రమాణాన్ని అభివృద్ధి చేసినట్లు బీఐఎస్ తెలిపింది.