
Ajay Banga: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ వృద్ధి రేటు మెరుగు :అజయ్ బంగా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వృద్ధి రేటు మెరుగ్గా ఉందని ఆయన తెలిపారు.
ఈ విషయం గురించి ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. భారత్ వృద్ధి రేటు పెరుగుదలలో మెజార్టీ పాత్ర దేశీయ మార్కెట్లదేనని, ఇది ఆరోగ్యకరమైన వాతావరణానికి సూచిక అని చెప్పారు.
త్వరలో జరగబోతున్న ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ వార్షిక సమావేశానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
వివరాలు
దేశాల సుస్థిర అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు మద్దతు
అయితే, దేశ ప్రజల జీవన నాణ్యత, పరిశుభ్రమైన గాలి, నీటి లభ్యత వంటి అంశాలపై భారత్ చర్యలు చేపట్టాలని అజయ్ బంగా సూచించారు.
భవిష్యత్తులో ఈ అంశాలపై భారత్ మరిన్ని ప్రాజెక్టులు రూపొందించాలని ఆయన కోరుకున్నారు.
ఆర్థిక వృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని భారత్ మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశాల సుస్థిర అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు మద్దతు ఇస్తుందని అన్నారు.