Page Loader
Retail inflation: అక్టోబర్‌ నెలలో భారతదేశ రిటైల్‌ ద్రవ్యోల్బణం మళ్లీ 6 శాతం పైకి..
అక్టోబర్‌ నెలలో భారతదేశ రిటైల్‌ ద్రవ్యోల్బణం మళ్లీ 6 శాతం పైకి..

Retail inflation: అక్టోబర్‌ నెలలో భారతదేశ రిటైల్‌ ద్రవ్యోల్బణం మళ్లీ 6 శాతం పైకి..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2024
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో మళ్ళీ రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. అక్టోబర్ నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతానికి చేరుకుంది, ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) లక్ష్యాన్ని మించిపోయింది. సెప్టెంబర్‌లో ఈ రేటు 5.49 శాతంగా ఉండగా, గత సంవత్సరం అక్టోబర్‌లో 4.87 శాతంగా నమోదైంది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం ఆహార పదార్థాల ధరల పెరుగుదల. ఈ వివరాలను మంగళవారం కేంద్ర గణాంక కార్యాలయం అధికారిక డేటా ద్వారా విడుదల చేసింది.

వివరాలు 

గత సంవత్సరం 6.61 శాతం

ఎన్‌ఎస్‌ఓ డేటా ప్రకారం, అక్టోబర్‌లో ఆహార పదార్థాల ధరలు సెప్టెంబర్‌లో 9.24 శాతం నుండి 10.87 శాతానికి పెరిగాయి. గత సంవత్సరం ఇదే సమయంలో ఈ రేటు 6.61 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి అప్పగించింది, దీని ప్రకారం కీలక వడ్డీ రేట్లను గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లింది. ఈ మధ్యకాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం కొద్దిగా తగ్గినప్పటికీ, మళ్ళీ 6 శాతం ఎగువకు చేరడం ఆందోళన కలిగిస్తోంది.