Page Loader
ఏప్రిల్‌లో 20నెలల కనిష్టానికి భారత వాణిజ్య లోటు 
ఏప్రిల్‌లో 20నెలల కనిష్టానికి భారత వాణిజ్య లోటు

ఏప్రిల్‌లో 20నెలల కనిష్టానికి భారత వాణిజ్య లోటు 

వ్రాసిన వారు Stalin
May 16, 2023
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏప్రిల్ నెలలో భారతదేశ వాణిజ్య లోటు 20 నెలల కనిష్టానికి తగ్గింది. అంటే 15.24బిలియన్ డాలర్లకు పరిమితమైంది. భారత గమ్యస్థానాలైన ఐరోపా, అమెరికాలో బలహీనమైన డిమాండ్ కారణంగా వస్తువుల దిగుమతులు, ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. దీంతో ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 2 బిలియన్లు తగ్గింది. వాణిజ్య లోటు వరుసగా మూడో నెల కూడా క్షీణత నమోదైంది. 2021 ఆగస్టులో వాణిజ్య లోటు 13.81 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆ తర్వాత ఈ ఏప్రిల్‌లోనే ఎగుమతులు, దిగుమతులు కనిష్టంగా నమోదు కావడం గమనార్హం.

వాణిజ్య లోటు

ఎగుమతులు, దిగుమతుల తగ్గుదలకి వస్తువుల ధరలే కీలకం

2022లో ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది 12.7శాతం తగ్గి 34.66బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. భారత గమ్యస్థానాలైన ఐరోపా, యూఎస్‌లో గిరాకీ మళ్లీ పెరగాలంటే కొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ నుంచి ఐరోపా, యూఎస్‌లో పరిస్థితులు మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక దిగుమతులను ఒకసారి పరిశీలిద్దాం. 2022 ఏప్రిల్‌లో దిగుమతులు 58.06బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్ లో 14శాతం తగ్గి, 49.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఎగుమతులు, దిగుమతులు రెండింటిలో తగ్గుదలకి వస్తువుల ధరలే కీలకమని విదేశీ వాణిజ్యం డైరెక్టర్ జనరల్ సంతోష్ సారంగి చెప్పారు.