LOADING...
India tops global remittances: ప్రపంచ రెమిటెన్స్‌లలో భారత్ అగ్రస్థానం: ఐక్యరాజ్యసమితి నివేదిక
ప్రపంచ రెమిటెన్స్‌లలో భారత్ అగ్రస్థానం: ఐక్యరాజ్యసమితి నివేదిక

India tops global remittances: ప్రపంచ రెమిటెన్స్‌లలో భారత్ అగ్రస్థానం: ఐక్యరాజ్యసమితి నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ దేశాల్లో విదేశాల్లో స్థిరపడిన వారు స్వదేశానికి పంపే సొమ్ము రూపంలో వచ్చే నిధుల్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. విదేశాల్లో ఉన్నవారు తమ కుటుంబాలకు, బంధువులకు పంపే ఈ సొమ్మును రెమిటెన్స్‌లు అంటారు. 2024 సంవత్సరంలో ప్రవాస భారతీయులు మొత్తం 13,767 కోట్ల డాలర్ల (రూ.13.01 లక్షల కోట్లు) భారీ మొత్తాన్ని స్వదేశానికి పంపారు. 10,000 కోట్ల డాలర్లకు మించి రెమిటెన్స్‌లు అందుకున్న ఏకైక దేశంగా కూడా భారత్ నిలిచింది. ఈ వివరాలను ఐక్యరాజ్య సమితి వలసలకు సంబంధించిన సంస్థ 'ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్' తన తాజా నివేదికలో వెల్లడించింది.

వివరాలు 

దక్షిణాసియా దేశాల రెమిటెన్స్‌లలో 11.8 శాతం వృద్ధి

2010 నుంచి వరుసగా భారత్ అత్యధిక రెమిటెన్స్‌లు అందుకుంటున్న దేశంగా కొనసాగుతోంది. దక్షిణాసియా దేశాలకు 2024లో వచ్చిన రెమిటెన్స్‌లలో 11.8 శాతం వృద్ధి నమోదైంది. విదేశాలకు వెళ్లిన భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రజలు తమ స్వదేశాలకు పెద్ద మొత్తంలో సొమ్ము పంపడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. ముఖ్యంగా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచే ఎక్కువ భాగం రెమిటెన్స్‌లు వచ్చాయి. విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఆసియా దేశాలవారే అధికంగా ఉన్నారు. 2022లో చైనా నుంచి 10 లక్షలకు పైగా విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించగా, భారత్ నుంచి 6.20 లక్షల మంది వెళ్లారు.

వివరాలు 

వలస విద్యార్థుల్లో సగానికి పైగా ఈ దేశాలలోనే..

తరువాత ఉజ్బెకిస్థాన్ నుంచి 1.50 లక్షలు, వియత్నాం నుంచి 1.34 లక్షలు, జర్మనీ నుంచి 1.26 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. అమెరికా, ఫ్రాన్స్, నైజీరియా, సిరియన్ అరబ్ రిపబ్లిక్, నేపాల్ దేశాల నుంచి 95 వేల నుంచి 1.15 లక్షల మధ్య విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారు. మొత్తం వలస విద్యార్థుల్లో సగానికి పైగా యూరప్, ఉత్తర అమెరికాలోనే విద్యనభ్యసిస్తున్నారు.

Advertisement

వివరాలు 

2024లో దేశాలవారీగా రెమిటెన్స్‌ల ప్రవాహం

2024లో దేశాలవారీగా రెమిటెన్స్‌ల ప్రవాహం ఇలా ఉంది. అమెరికా నుంచి 10,000 కోట్ల డాలర్లు, సౌదీ అరేబియా నుంచి 4,600 కోట్ల డాలర్లు, స్విట్జర్లాండ్ నుంచి 4,000 కోట్ల డాలర్లు, జర్మనీ నుంచి 2,400 కోట్ల డాలర్లు భారత్‌కు వచ్చాయి. భారత్‌కు వచ్చిన రెమిటెన్స్‌ల వృద్ధి కూడా గణనీయంగా పెరిగింది. 2010లో 5,348 కోట్ల డాలర్లు ఉండగా, 2015లో 6,891 కోట్ల డాలర్లు, 2020లో 8,315 కోట్ల డాలర్లు, 2024లో 13,767 కోట్ల డాలర్లకు చేరుకుంది.

Advertisement