Loading...
India GDP: తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8శాతం వృద్ధి.. దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ
తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8శాతం వృద్ధి.. దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ

India GDP: తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8శాతం వృద్ధి.. దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపథంలో దూసుకెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.8 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన 6.9 శాతం వృద్ధితో పోలిస్తే ఈసారి మెరుగైన వృద్ధిరేటు నమోదైంది. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాస్తవ జీడీపీ రూ.81.36 లక్షల కోట్లు స్థిర ధరల ఆధారంగా లెక్కించే వాస్తవ జీడీపీ (Real GDP) 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.75.46 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ కాలంలో ఇది రూ.81.36 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

వివరాలు 

ప్రపంచ ప్రతికూలతల మధ్య కూడా వృద్ధి

దీంతో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైనట్లు పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలోనే పయనిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నా దేశీయ ఆర్థిక వ్యవస్థ తన వృద్ధిని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.

వివరాలు 

నామినల్‌ జీడీపీ 10.3 శాతం వృద్ధి

ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కించే నామినల్‌ జీడీపీ (Nominal GDP) కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నామినల్‌ జీడీపీ 10.3 శాతం పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది.

2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో నామినల్‌ జీడీపీ రూ.80 లక్షల కోట్లుగా ఉంది.

ఈ ఏడాది ఇదే కాలంలో అది రూ.88.27 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జీడీపీపై నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT