LOADING...
Rupee value: అమెరికా డాలర్‌తో పోలిస్తే.. జీవనకాల కనిష్టానికి భారత రూపాయి 
అమెరికా డాలర్‌తో పోలిస్తే.. జీవనకాల కనిష్టానికి భారత రూపాయి

Rupee value: అమెరికా డాలర్‌తో పోలిస్తే.. జీవనకాల కనిష్టానికి భారత రూపాయి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ కరెన్సీ రూపాయి విలువ జీవనకాల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. శుక్రవారం డాలరుతో రూపాయి మారకం విలువ తొలిసారిగా 84 స్థాయిని చేరుకుంది. పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు, ఈక్విటీ మార్కెట్ నుండి విదేశీ ద్రవ్యం బయటకు వెళ్ళడం రూపాయి విలువపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా, నేడు ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి అయిన 84.05 స్థాయికి చేరింది.

వివరాలు 

విదేశీ మదుపర్లు విక్రేతలుగా నిలవడం కూడా ఒక కారణం 

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 70 డాలర్ల స్థాయినుంచి ఇటీవల దాదాపు 10 శాతం పెరిగింది. దీనికి అదనంగా, నిన్న అమెరికాలో విడుదలైన సీపీఐ డేటా మరో ముఖ్యమైన కారణమైంది. అంచనించిన స్థాయికి కంటే అధికంగా నమోదవ్వడంతో, ఫెడ్‌ వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి నెలకొంది. డిసెంబర్ నెలలో మరో 25 లేదా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ కోత ఉండవచ్చని అంచనాలు తగ్గాయి. ఈక్విటీ మార్కెట్‌లో ఇటీవల విదేశీ మదుపర్లు విక్రేతలుగా నిలవడం కూడా ఈ పరిస్థితులకు ఒక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.