Stock Market: భారీ నష్టాల్లో సూచీలు.. 1600 పాయింట్లపైన కుప్పకూలిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆర్థిక సంవత్సరం చివరి రోజున భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రతరం అవుతాయన్న ఆందోళనలు, అంతర్జాతీయంగా చమురు ధరలు వేగంగా పెరగడం, అలాగే ఇరాన్‌కు మద్దతుగా హూతీ గ్రూప్ రంగంలోకి దిగడం వంటి పరిణామాలు మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నిఫ్టీ 22,350 స్థాయి దిగువన ముగిసింది. మదుపర్ల సంపదగా భావించే నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.412 లక్షల కోట్లకు పడిపోయింది. మొత్తంగా ఆర్థిక సంవత్సరం చివరి రోజున మార్కెట్ నష్టాలతో ముగియడం గమనార్హం. మహవీర్ జయంతి సందర్భంగా మార్చి 31న స్టాక్ ఎక్స్చేంజీలు పనిచేయవు.
వివరాలు
సూచీల పనితీరు ఇలా…
ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ భారీ నష్టాల్లో 72,565.22 వద్ద ప్రారంభమైంది (మునుపటి ముగింపు 73,583.22). ఇంట్రాడేలో 71,774.13 వరకు పడిపోయిన సూచీ, చివరకు 1635.67 పాయింట్ల నష్టంతో 71,947.55 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 488.20 పాయింట్లు కోల్పోయి 22,331.40 వద్ద స్థిరపడింది.డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.94గా నమోదైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తప్ప మిగతా అన్ని షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, ఇండిగో, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 115డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సుకు 4,532 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు
ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు సిద్ధమవుతోందన్న వార్తలు మార్కెట్‌లో భయాందోళనలు రేపాయి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ అమెరికాకు ఘాటు హెచ్చరికలు చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన రవాణాలో అంతరాయం ఏర్పడింది హూతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేయవచ్చన్న భయాలు పెరిగాయి బ్రెంట్ క్రూడ్ ధరలు మూడు శాతం పెరిగి బ్యారెల్‌కు 115.9 డాలర్లకు చేరాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు ప్రభావం చూపాయి ఎఫ్‌ఐఐలు భారీగా షేర్ల విక్రయాలు కొనసాగించడం సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచింది శుక్రవారం ఒక్కరోజే రూ.4367 కోట్ల విలువైన షేర్లను విదేశీ పెట్టుబడిదారులు విక్రయించారు