LOADING...
Stock Market: లాభనష్టాల మధ్య దోబూచులాడుతున్న మార్కెట్.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు..
స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు..

Stock Market: లాభనష్టాల మధ్య దోబూచులాడుతున్న మార్కెట్.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు..

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2026
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం గట్టి లాభాలను నమోదు చేసిన తరువాత గురువారం కూడా అదే ఊపుతో ప్రారంభమయ్యాయి. అయితే ఆరంభంలో వచ్చిన లాభాలు ఎక్కువసేపు నిలవలేదు. కొంతసేపటికే సూచీలు దిగివచ్చి మార్పులతో కదలాడుతున్నాయి. ఆటో మొబైల్, లోహ రంగాల షేర్లు లాభాల్లో ఉండగా,స్థిరాస్తి రంగం మాత్రం సూచీలను వెనక్కి లాగుతోంది. ప్రపంచ స్థాయి రాజకీయ పరిస్థితుల ప్రభావంతో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో స్థిరత్వం లేకుండా లాభనష్టాల మధ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం సూచీలు స్వల్ప లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.79గా నమోదైంది. గత ట్రేడింగ్ ముగింపులో 77,958వద్ద నిలిచిన సెన్సెక్స్ గురువారం ఉదయం దాదాపు 350పాయింట్ల లాభంతో 78,339వద్ద ప్రారంభమైంది.

వివరాలు 

63 పాయింట్ల లాభంతో కొనసాగుతున్న బ్యాంకింగ్ రంగ సూచీ

కానీ ఆ తర్వాత ఆ లాభాలను కోల్పోయి కిందకు జారింది. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్ల లాభంతో 78,065 వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ కూడా ఇదే ధోరణిలో కదులుతోంది. ప్రారంభంలో పెరిగినప్పటికీ తరువాత కొంత తగ్గి ప్రస్తుతం 39పాయింట్ల లాభంతో 24,370 వద్ద ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో కొన్ని ప్రధాన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వాటిలో పేటీఎమ్,పాలీక్యాబ్, సీజీ పవర్,శ్రీ సిమెంట్స్,హిటాచీ ఎనర్జీ ఉన్నాయి. మరోవైపు గోద్రేజ్ కన్జ్యూమర్, కేపీఐటీ టెక్, పీబీ ఫిన్‌టెక్, కేఈఐ ఇండస్ట్రీస్, బ్లూ స్టార్ వంటి షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మధ్య స్థాయి కంపెనీల సూచీ 162 పాయింట్ల లాభంతో ఉండగా, బ్యాంకింగ్ రంగ సూచీ 63 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

Advertisement