Loading...
stock market: దసరా సందర్భంగా రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు
దసరా సందర్భంగా రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు

stock market: దసరా సందర్భంగా రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా (విజయదశమి) పండుగ సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లకు రేపు సెలవు ప్రకటించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో ట్రేడింగ్ జరగదు. ఈ సెలవుతో ఈక్విటీ, డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ విభాగాల్లో ట్రేడింగ్, సెటిల్‌మెంట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ నెల 2న గాంధీ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు ఇచ్చారు. ఇప్పుడు దసరా కారణంగా మరోసారి ట్రేడింగ్ నిలిచిపోనుంది. 2026 సంవత్సరానికి సంబంధించి ఎక్స్ఛేంజీల సెలవుల జాబితా ప్రకారం బుధవారం నుంచి మళ్లీ ట్రేడింగ్ ప్రారంభం కానుంది.

వివరాలు 

వస్తువుల మార్కెట్ల పరిస్థితి ఏమిటి?

దసరా సందర్భంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో రేపు ఉదయం ట్రేడింగ్ జరగదు.

అయితే సాయంత్రం సెషన్‌లో ట్రేడింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.

మరోవైపు, నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ (NCDEX)లో మాత్రం ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలోనూ ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోనుంది.

కమోడిటీ మార్కెట్లలో లావాదేవీలు నిర్వహించే ట్రేడర్లు తమకు సంబంధించిన ఎక్స్ఛేంజీల సెలవుల జాబితాను పరిశీలించి, ట్రేడింగ్ సమయాలపై స్పష్టత తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.

వివరాలు 

2026లో రానున్న స్టాక్ మార్కెట్ సెలవులు ఇవే..

దసరా సెలవు తర్వాత 2026లో స్టాక్ మార్కెట్లకు మరో మూడు సెలవులు ఉన్నాయి.

నవంబర్ 10న దీపావళి బలిప్రతిపద, నవంబర్ 24న గురునానక్ జయంతి, డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉండనుంది.

ఈ ఏడాది క్రిస్మస్ శుక్రవారం రావడంతో మార్కెట్‌లో పాల్గొనే వారికి వరుసగా సెలవులు కలిసి రానున్నాయి.

మరోవైపు, దీపావళి లక్ష్మీ పూజ ఈ ఏడాది ఆదివారం వచ్చినప్పటికీ, సంప్రదాయం ప్రకారం ఎక్స్ఛేంజీలు ముహూర్త ట్రేడింగ్ నిర్వహించే అవకాశం ఉంది.

ADVERTISEMENT