LOADING...
Stock Market: అమెరికా,భారత్ మధ్య ట్రేడ్ డీల్ వేళ.. ఫుల్ జోష్‌లో దేశీయ మార్కెట్ సూచీలు
ఫుల్ జోష్‌లో దేశీయ మార్కెట్ సూచీలు

Stock Market: అమెరికా,భారత్ మధ్య ట్రేడ్ డీల్ వేళ.. ఫుల్ జోష్‌లో దేశీయ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరుస నష్టాల తర్వాత కోలుకొని, దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసిన నేపథ్యంలో శుక్రవారం కూడా లాభాల ధోరణిలో కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి సూచీలు లాభంతో ప్రారంభమయ్యాయి. అమెరికా-భారత్ మధ్య వ్యాపార ఒప్పందం సాధ్యమవుతుందన్న ఊహలు, ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో మాట్లాడిన విషయాలు, అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు మార్కెట్లను ముందుకు నడిపిస్తున్నాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో కదులుతున్నాయి. గత సెషన్ ముగింపు స్థాయితో (84,818 పాయింట్లు) పోలిస్తే, శుక్రవారం ఉదయం సెన్సెక్స్ లాభాలతో ప్రారంభమై ఆ జోరు కొనసాగిస్తోంది.

వివరాలు 

రూపాయి మారకం విలువ 90.39గా నమోదు 

ఒక దశలో 400 పాయింట్ల పైగా వృద్ధి సాధించింది. ఉదయం 10:15 గంటల స‌మయంలో, సెన్సెక్స్ 257 పాయింట్ల లాభంతో 85,075 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కొనసాగుతూ, ప్రస్తుతానికి 96 పాయింట్ల లాభంతో 25,995 వద్ద ఉంది. సెన్సెక్స్‌లో హిందుస్థాన్ జింక్, కేన్స్ టెక్నాలజీస్, దాల్మియా భారత్, సమ్మన్ క్యాపిటల్, హిందాల్కో లాంటి షేర్లు లాభాలను నమోదు చేస్తున్నాయి. ఒరాకిల్ ఫిన్‌సెర్వ్, కంటైనర్ కార్పొరేషన్, కేఈఐ ఇండస్ట్రీస్, మారికో, సయింట్ వంటి షేర్లు నష్టాలలో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 227 పాయింట్ల లాభంతో ఉంది, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 405 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 90.39 వద్ద ఉంది.

Advertisement