LOADING...
Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 161 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
161 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 161 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 96 మార్కును దాటడం మార్కెట్‌ భావోద్వేగాలను దెబ్బతీశాయి. దీనికితోడు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో వరుసగా రెండు రోజులుగా కొనసాగిన లాభాలకు బ్రేక్‌ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గత ముగింపు 75,398.72 పాయింట్లతో పోలిస్తే 75,497.10 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయంలో 75,870.36 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ.. చివర్లో భారీ అమ్మకాలతో కిందకు జారింది.

వివరాలు 

బ్రెంట్‌ ముడి చమురు బ్యారెల్‌ ధర 108 డాలర్లు 

చివరకు 160.73 పాయింట్లు కోల్పోయి 75,237.99 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 46.10 పాయింట్లు పడిపోయి 23,643.50 వద్ద స్థిరపడింది. విదేశీ మారక మార్కెట్‌లో రూపాయి బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇంట్రాడేలో 96.15 కనిష్ఠ స్థాయికి చేరి, అనంతరం 95.94 వద్ద కొనసాగింది. సెన్సెక్స్‌లోని ప్రధాన షేర్లలో టాటా స్టీల్‌, ఎటర్నల్‌, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎస్‌బీఐ కంపెనీల వాటాలు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అదానీ పోర్ట్స్‌, మారుతీ సుజుకీ షేర్లు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి చమురు బ్యారెల్‌ ధర 108 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సుకు 4,560 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement