ఈ ఆర్ధిక సంవత్సరంలో విదేశీ పర్యటనల కోసం భారతీయులు పెట్టిన ఖర్చు $10బిలియన్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో భారతీయులు విదేశీ ప్రయాణాలకు దాదాపు $10 బిలియన్లు ఖర్చు పెట్టారు.రికార్డు స్థాయి ట్రావెల్ సీజన్ ఈ త్రైమాసికంలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రకారం, 2020 సంవత్సరం విమాన ప్రయాణ చరిత్రలో అత్యంత నష్టపోయిన సంవత్సరం. అయితే, 2022లో పరిస్థితులు మారాయి. ఏప్రిల్, డిసెంబర్ మధ్య, భారతీయులు $9,947 మిలియన్లు ఖర్చు చేశారు. RBI డేటా ప్రకారం, అందులో 2022 డిసెంబర్‌లోనే $1,137 మిలియన్లు వచ్చాయి.
వియత్నాం వంటి ప్రదేశాలకు భారతీయులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు
2022 ఆర్థిక సంవత్సరంలో 35%తో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణ వాటా 51%కి పెరిగింది. వియత్నాం వంటి ప్రదేశాలకు భారతీయులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. కజాఖ్స్తాన్ లేదా అబుదాబి యాస్ ద్వీపం వంటి కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో ఖర్చు చేసిన మొత్తం విదేశీ మారకంలో పెరుగుదల కనిపించింది. భారతీయులు విద్య, బంధువుల నిర్వహణ, బహుమతులు, పెట్టుబడులు, ప్రయాణాల కోసం ఏప్రిల్ డిసెంబర్ మధ్య $19,354 మిలియన్లను పంపించారు. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు పంపిన $19,610 మిలియన్లకు దగ్గరగా ఉంది. భారతీయుల సగటు నెలవారీ చెల్లింపులు ఇప్పుడు దాదాపు $2 బిలియన్లు.