Indigo: ఇండిగో సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు: ఫారెక్స్ నష్టాలతో రూ. 2,582 కోట్ల నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ నవంబర్ 4న మార్కెట్ సమయం ముగిసిన తర్వాత తమ 2025 ఆర్థిక సంవత్సరం రెండవ (సెప్టెంబర్) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం,గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.987 కోట్ల నష్టం నమోదు కాగా, ఈసారి ఆ నష్టం రూ. 2,582 కోట్లకు పెరిగింది. ఆపరేషన్ల పరంగా బలమైన ప్రదర్శన ఉన్నప్పటికీ, విదేశీ మారకపు నష్టాలు (Forex Losses) కంపెనీపై తీవ్ర ప్రభావం చూపాయి. అయినప్పటికీ, ఆపరేషన్ల నుండి వచ్చిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 9.3% పెరిగి రూ. 18,555 కోట్లకు చేరింది. సామర్థ్య వినియోగం, సమర్థమైన నిర్వహణ కారణంగా ఈ వృద్ధి సాధ్యమైందని సంస్థ తెలిపింది.
వివరాలు
ప్రయాణీకులు, సామర్థ్యంలో వృద్ధి
ఈ త్రైమాసికంలో విమాన సామర్థ్యం (Capacity) 7.8% పెరిగి 41.2 బిలియన్లకు చేరుకుంది. ప్రయాణీకుల సంఖ్య కూడా 3.6% పెరిగి 28.8 మిలియన్లకు చేరింది. EBITDAR తగ్గుదల నిర్వహణ స్థాయి లాభాన్ని సూచించే EBITDAR (వడ్డీ, పన్ను, తరుగుదల, లీజు అద్దెలు మినహాయించే ముందు లాభం) గతేడాది రూ. 2,434 కోట్లుగా ఉండగా, ఈసారి అది రూ. 1,114 కోట్లకు తగ్గింది. ఫలితంగా EBITDAR మార్జిన్ కూడా 14.3% నుంచి 6%కు పడిపోయింది.
వివరాలు
ఫారెక్స్ నష్టాలే ప్రధాన భారమైయ్యాయి
ఇండిగో మొత్తం ఖర్చులు ఈసారి 18.3% పెరిగి రూ.22,081 కోట్లకు చేరాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం విదేశీ మారకపు నష్టాలు అని సంస్థ వివరించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.204 కోట్ల ఫారెక్స్ నష్టం ఉండగా, ఈసారి అది రూ. 2,892 కోట్లకు పెరిగింది. అంటే 1,102% పెరుగుదల. ఇది అన్ని ఖర్చుల విభాగాల్లోనే అత్యధిక పెరుగుదలగా నిలిచింది. ఇతర ఖర్చుల విభజన తరుగుదల & రుణ విమోచన (Depreciation & Amortization): 26.5% పెరిగి రూ. 2,640 కోట్లు ఆర్థిక వ్యయాలు (Finance Costs): 18.1% పెరిగి రూ. 1,465 కోట్లు..విమానాల సంఖ్య,లీజు బాధ్యతల పెరుగుదల దీనికి కారణం. అద్దెలు, మరమ్మత్తు ఖర్చులు: 18.9%పెరిగి రూ. 3,263 కోట్లు
వివరాలు
ఫారెక్స్ ప్రభావం లేకుంటే లాభం వచ్చేది
విమాన ఇంధన వ్యయం (Aircraft Fuel): మాత్రం 9.7% తగ్గి రూ. 5,962 కోట్లుగా నమోదై, సంస్థకు కొంత ఉపశమనం ఇచ్చింది. విదేశీ మారకపు ప్రభావం లేకుండా లెక్కిస్తే, ఇండిగో EBITDAR రూ. 3,800 కోట్లుగా ఉండేది. ఈ ఆధారంగా EBITDAR మార్జిన్ 20.5%గా ఉంటుంది. అంటే, ఫారెక్స్ నష్టాలు లేకుంటే సంస్థ ఈ త్రైమాసికంలో రూ. 103.9 కోట్ల నికర లాభం నమోదు చేసేది.
వివరాలు
CEO పీటర్ ఎల్బర్స్ స్పందన
"ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో విమానయాన రంగం అనేక బాహ్య సవాళ్లను ఎదుర్కొంది. కానీ జూలై నుండి పరిస్థితులు స్థిరపడ్డాయి, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బలమైన పునరుద్ధరణ (recovery) చూశాం," అని ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. "ముందుకు చూస్తే, పెరుగుతున్న ప్రయాణ డిమాండ్‌ను అందుకోవడానికి మేము ద్వితీయార్థంలో కార్యకలాపాల ప్రణాళికను విస్తరించాము. ఈ నేపథ్యంలో, 2026 ఆర్థిక సంవత్సరానికి సామర్థ్య వృద్ధి మార్గదర్శకాన్ని 'early teens growth' స్థాయికి పెంచుతున్నాము" అని ఆయన తెలిపారు. విమానాల వివరాలు (సెప్టెంబర్ 30, 2025 నాటికి): ఇండిగో విమాన సముదాయం 417కి చేరుకుంది. ఇందులో 180 A320 నియో, 153 A321 నియో, 47 ఏటీఆర్, 3 A321 ఫ్రైటర్స్ ఉన్నాయి.