IndiGo: ఇండిగో సమ్మర్ గెటవే సేల్.. ఫ్లైట్ టికెట్లపై ఆఫర్లు.. ప్రయాణికులకు సూపర్ ఛాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ,అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రత్యేక 'సమ్మర్ గెటవే' సేల్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్ బుకింగ్‌పై 10% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రాయితీ పొందాలంటే టికెట్ బుక్ చేసే సమయంలో SUMR10 అనే ప్రోమో కోడ్ ఉపయోగించాలి. ఈ ఆఫర్‌తో బుక్ చేసిన టికెట్లపై ప్రయాణం జూలై 1, 2026 నుంచి అక్టోబర్ 9,2026 మధ్య ఉండాలి. అయితే ఈ లిమిటెడ్ ఆఫర్‌ను పొందాలంటే ఏప్రిల్ 14 నుంచి 17 మధ్యలోనే బుకింగ్ పూర్తి చేయాలి. ఈ 'సమ్మర్ గెటవే' సేల్ ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, AI ఆధారిత అసిస్టెంట్ 6Eskai, అలాగే వాట్సాప్ సేవల ద్వారా కూడా అందుబాటులో ఉంది.
వివరాలు
ఆఫర్ సమయంలో ఇండిగో 6E యాడ్-ఆన్ సేవలపై భారీ డీల్స్
అంతేకాదు, కొన్ని ట్రావెల్ పార్ట్నర్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీంతో ప్రయాణికులు సులభంగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే, ఈ ఆఫర్ సమయంలో ఇండిగో తన 6E యాడ్-ఆన్ సేవలపై భారీ డీల్స్ అందిస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో త్వరగా ప్రక్రియ పూర్తి చేసుకునే ఫాస్ట్ ఫార్వర్డ్ సేవపై 70% వరకు తగ్గింపు ఉంది. అలాగే ముందుగా అదనపు లగేజీ బుక్ చేసుకుంటే 50% వరకు రాయితీ లభిస్తుంది.
వివరాలు
దేశీయ, అంతర్జాతీయ రూట్లలో 15% వరకు తగ్గింపు
కొన్ని దేశీయ, అంతర్జాతీయ రూట్లలో సీటు ఎంపికపై కూడా 15% వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ సౌకర్యం కోరుకునే ప్రయాణికుల కోసం అదనపు లెగ్‌రూమ్ ఉన్న ఎమర్జెన్సీ ఎక్స్‌ఎల్ సీట్లు కేవలం రూ.500 నుంచే అందిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆఫర్లతో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ఇబ్బందిలేకుండా చేసుకునే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. కాబట్టి ఈ లిమిటెడ్ టైమ్ డీల్స్‌ను ఉపయోగించుకోవాలనుకునే వారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.