IndiGo: సంక్షోభం వేళ భారీగా విలువ కోల్పోయిన ఇండిగో షేర్లు
ఈ వార్తాకథనం ఏంటి
వైమానిక రంగంలోని ప్రముఖ సంస్థ ఇండిగో, మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (Interglobe Aviation Ltd) షేర్ల మార్కెట్‌లో భారీగా పడిపోయాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ల విలువ 9 శాతానికి పైగా విలువ కోల్పోయాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఒక్కసారిగా 7 శాతంతో పతనమైంది, ఆ తర్వాత కొద్దిగా కోలుకొంది. ఉదయం 10 గంటల సమయంలో షేర్లు రూ.5,160 వద్ద, 3.92 శాతం (రూ.210.50) నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇండిగో డీజీసీసీ (DGCA) కొత్త ఎఫ్‌డీటీఎల్ (FDTL) నిబంధనలకు సరిపడవడంలో విఫలమయ్యింది. దాంతో గత కొన్ని రోజుల్లో కంపెనీకి చెందిన వందల విమానాలు రద్దయ్యాయి.
వివరాలు
మూడు వేల బ్యాగేజీలు
అయితే, సోమవారం నుండి సంస్థ కార్యకలాపాలు మెల్లగా సాధారణ స్థాయికి చేరడం ప్రారంభమయ్యాయి. సోమవారం ఇండిగో మొత్తం 1,650 విమానాలను నడిపింది. రద్దైన లేదా తీవ్రంగా ఆలస్యమైన విమానాల ప్రయాణికులకు అందించిన రిఫండ్ల రూపంలో ఇండిగో ఇప్పటివరకు రూ.610 కోట్లు విడుదల చేసింది. అదనంగా, మూడు వేల బ్యాగేజీలను కూడా ప్రయాణికులకు అప్పగించిందని తెలిపింది.