Indo-MIM IPO: ఇండో-మిమ్ ఐపీఓకు భారీ స్పందన.. గ్రే మార్కెట్లో భారీ ప్రీమియం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రెసిషన్ ఇంజినీరింగ్ భాగాల తయారీ సంస్థ ఇండో-మిమ్ లిమిటెడ్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ మెయిన్‌బోర్డ్ పబ్లిక్ ఇష్యూ నేడు ముగియనుండగా, తొలి రెండు రోజుల సబ్‌స్క్రిప్షన్‌లోనే విశేష ఆదరణ దక్కింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) గణాంకాల ప్రకారం, సోమవారం ఉదయం నాటికి రూ.3,812 కోట్ల విలువైన ఈ ఐపీఓ 4.18 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇష్యూ ముగింపు దశకు చేరుకున్న వేళ గ్రే మార్కెట్లో కూడా ఇండో-మిమ్ షేర్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది.
వివరాలు
జూలై 28న పూర్తికానున్న పబ్లిక్ ఇష్యూ షేర్ల కేటాయింపు
ప్రస్తుతం ఒక్కో షేర్‌పై రూ.193 గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) నమోదవుతోంది.
దీంతో ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ సమయంలో పెట్టుబడిదారులకు దాదాపు 40 శాతం వరకు లాభం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఐపీఓ గరిష్ఠ ధర బ్యాండ్ ఒక్కో షేర్‌కు రూ.485గా నిర్ణయించగా, ప్రస్తుత జీఎంపీ ఆధారంగా షేర్లు జూలై 30న సుమారు రూ.678 వద్ద మార్కెట్లో అడుగుపెట్టే అవకాశముందని భావిస్తున్నారు.
ఈ పబ్లిక్ ఇష్యూ షేర్ల కేటాయింపు ప్రక్రియ జూలై 28న పూర్తికానుంది.