Page Loader
Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం 
Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం

Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 01, 2023
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ దిగ్గజ సాఫ్ట్‌వేర్-సేవల ఎగుమతిదారు ఇన్ఫోసిస్ లిమిటెడ్ తన ఉద్యోగులలో కొంతమందిని నెలకు 10 రోజులు ఆఫీసు నుండి పని చేయమని కోరింది. ఈ విషయమై మెయిల్స్‌ ద్వారా సమాచారం ఇచ్చింది. ఇన్ఫోసిస్‌లోని పని చేసే కొందరు ఉద్యోగులు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో మొదలైన వర్క్‌ ఫ్రంహోమ్‌ కల్చర్ నుండి ఇప్పుడిప్పుడే అన్ని కంపెనీలు బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా వారి ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు అనేక చర్యలు చేపడుతున్నాయి.

Details 

ఆఫీస్ నుండి కొన్ని రోజులు పని చెయ్యాలన్న టెక్ దిగ్గజాలు

ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన ఇన్ఫోసిస్, నవంబర్ 20 నుండి అమలులోకి వచ్చే మార్పు గురించి కొంతమంది ఎంట్రీ, మిడ్-లెవల్ సిబ్బందికి ఇ-మెయిల్ ద్వారా తెలియజేసింది. రిటర్న్ టు ఆఫీస్, హైబ్రిడ్‌ పని విధానాన్ని ప్రోత్సహించడం అలాగే ఉద్యోగుల మధ్య అనుబంధం, టీం స్పిరిట్ ను పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్ అన్నారు. ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తమ ఉద్యోగులను వారానికి ఐదు రోజులపాటు ఆఫీసు నుండి పని చేయాలని కోరింది. టెక్ దిగ్గజాలు Amazon.com Inc, Alphabet Inc ,Google కూడా ప్రతి వారం కనీసం కొన్ని రోజులు ఆఫీసు నుండి పని చేయాలని కార్మికులకు సూచించాయి.