Loading...
Infosys Penalty: ఫ్రాన్స్‌లో ఇన్ఫోసిస్‌కు రూ.2 కోట్ల జరిమానా.. టైమ్ ట్రాకింగ్ వ్యవస్థలో లోపాలు
టైమ్ ట్రాకింగ్ వ్యవస్థలో లోపాలు

Infosys Penalty: ఫ్రాన్స్‌లో ఇన్ఫోసిస్‌కు రూ.2 కోట్ల జరిమానా.. టైమ్ ట్రాకింగ్ వ్యవస్థలో లోపాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2026
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగుల పని గంటల నమోదు వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటూ ఫ్రాన్స్‌లో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీ జరిమానా విధించారు. అక్కడి కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంబంధించి కంపెనీపై 1,75,000 యూరోల(భారత కరెన్సీలో సుమారు రూ.2 కోట్లు)జరిమానా విధించినట్లు వెల్లడైంది. ఉద్యోగుల పని గంటలను నమోదు చేసే టైమ్ ట్రాకింగ్ వ్యవస్థ ఫ్రాన్స్ కార్మిక నిబంధనలకు పూర్తిస్థాయిలో అనుగుణంగా లేదని అక్కడి కార్మిక నియంత్రణ సంస్థ DRIEETS Île-de-France గుర్తించింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. జూలై 24న ఫ్రాన్స్ అధికారుల నుంచి జరిమానాకు సంబంధించిన అధికారిక సమాచారం అందిందని తెలిపింది.

వివరాలు 

గుర్తించిన లోపాలివే..

అయితే ఈ జరిమానా కారణంగా కంపెనీ ఆర్థిక ఫలితాలు,రోజువారీ కార్యకలాపాలు లేదా వ్యాపారంపై ఎలాంటి గణనీయమైన ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది.

ఫ్రాన్స్ కార్మిక అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఇన్ఫోసిస్ ఉపయోగిస్తున్న ఉద్యోగుల పని గంటల నమోదు వ్యవస్థలో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా..

పని గంటల రికార్డుల విశ్వసనీయత పూర్తిస్థాయిలో లేకపోవడం.

అవసరమైనప్పుడు ఆడిట్ నిర్వహించేందుకు వ్యవస్థ తగిన విధంగా లేకపోవడం.

కొంతమంది ఉద్యోగుల పని గంటలను సమర్థవంతంగా పర్యవేక్షించే సామర్థ్యం లేకపోవడం.

ఈ అంశాలన్నీ ఫ్రాన్స్ కార్మిక చట్టాలకు అనుగుణంగా లేవని అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

ఇన్ఫోసిస్ స్పందన

జరిమానా అంశంపై ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. ప్రస్తుతం పూర్తి వివరాలను పరిశీలిస్తున్నామని, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

అలాగే అధికారిక సమాచారం అందిన వెంటనే ఈ విషయాన్ని బహిర్గతం చేయకపోవడానికి కారణాన్ని కూడా వివరించింది.

ముందుగా ఘటనకు సంబంధించిన వాస్తవాలను సమగ్రంగా పరిశీలించి, తదుపరి చర్యలపై స్పష్టతకు వచ్చిన తర్వాతే సమాచారం వెల్లడించినట్లు కంపెనీ తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

ఫ్రాన్స్‌లో పని గంటల నిబంధనలు కఠినం

ఫ్రాన్స్‌లో ఉద్యోగుల పని గంటల నమోదుకు సంబంధించి అత్యంత కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి.

ఉద్యోగి ఎప్పుడు విధుల్లో చేరాడు, ఎప్పుడు పని ముగించాడు, మొత్తం ఎంతసేపు పనిచేశాడు వంటి వివరాలను కచ్చితంగా నమోదు చేయడం తప్పనిసరి.

ఈ రికార్డులను కార్మిక శాఖ అధికారులు ఎప్పుడైనా పరిశీలించే అవకాశం ఉండటంతో, టైమ్ ట్రాకింగ్ వ్యవస్థలో చిన్నపాటి లోపం కనిపించినా సంబంధిత సంస్థలపై జరిమానాలు లేదా ఇతర చర్యలు తీసుకునే అవకాశముంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఐటీ షేర్లలో జోరు

మరోవైపు, మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో ఐటీ రంగ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి.

టీసీఎస్ షేరు 4 శాతానికి పైగా లాభపడగా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి.

ఇన్ఫోసిస్ షేరు కూడా దాదాపు 3 శాతం వరకు పుంజుకుంది.

చాలా రోజుల తర్వాత ఐటీ రంగంలో బలమైన కొనుగోళ్లు కనిపించడంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం నెలకొంది.

ADVERTISEMENT