
Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఉద్యోగులకు త్రైమాసిక పనితీరు బోనస్‌ను ప్రకటించింది. ఈ నెల వేతనంతో కలిపి కంపెనీ 80శాతం బోనస్‌ను చెల్లించనుంది.
మేనేజర్ నుంచి అంతకంటే తక్కువ ఉద్యోగులకు మాత్రమే వేరియబుల్ పేను కంపెనీ చెల్లించనుంది.
జూన్ 2023 త్రైమాసికంలో కూడా కంపెనీ అదే సగటు వేరియబుల్ పే చెల్లించింది.
ఇన్ఫోసిస్ ఉద్యోగులు జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి 60శాతం సగటు వేరియబుల్ వేతనం, జూన్ 2022 త్రైమాసికానికి 70శాతం సగటు వేరియబుల్ వేతనం పొందారు.
ఈ వార్తతో కంపెనీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆనందంలో కంపెనీ ఉద్యోగులు
#Infosys to pay 80 per cent performance bonus to some employees, here is who is eligible https://t.co/MlwcKt0D86 #WeRIndia pic.twitter.com/htrjECi0Eg
— Werindia (@werindia) November 20, 2023