దారుణంగా పతనమైన ఇన్ఫోసిస్ స్టాక్.. ఇంట్రాడేలో 10శాతం డౌన్
మార్కెట్ వాటా పరంగా దేశంలో ఇన్ఫోసిస్ రెండవ అతిపెద్ద టెక్ సంస్థగా ఉంది. శుక్రవారం ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇంట్రాడేలో ఏకంగా పదిశాతం వరకూ క్రాష్ కావడం గమనార్హం. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అంచనాలను అదుకోకపోవడం, రెవెన్యూ గైడెన్స్ లో కోత విధించడ వల్లే షేర్లు పతనమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బ్రోకరేజీ కంపెనీల టార్గెట్లు, రేటింగ్ తగ్గించడం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఇన్ఫోసిస్ షేర్లు శుక్రవారం ఉదయం రూ.1320 వద్ద మొదలు కాగా, రూ.1350 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకున్నాయి. ఇన్ఫోసిస్ షేర్లు మధ్యాహ్నం ఒంటి గంటకు రూ.118 వరకు నష్టపోయి రూ.1331 వద్ద కొనసాగుతున్నాయి.
షేర్లను అమ్ముకోవాలని సూచించిన నొమురా
నెల రోజుల్నుంచి కొనుగోళ్ల మద్దతుతో రూ.1450కి చేరుకుంది. అయితే ఇప్పుడు ఫలితాల రాకతో మళ్లీ పతనం మొదలైంది. గురువారం సాయంత్రం ఇన్ఫోసిస్ జూన్‌తో ముగిసిన త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన రూ.5,945 కోట్ల నికర లాభం నమోదు చేసింది. 10 శాతం వృద్ధితో రూ.37,933 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా సాఫ్ట్‌వేర్ రంగం అనిశ్చితిలో ఉండటంతో 2024 ఆర్థిక ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలను కంపెనీ కట్ చేసింది. కాన్‌స్టాంట్ కరెన్సీ విధానంలో గతంలో 4-7 శాతంగా ఉన్న ఆదాయం వృద్ధిరేటును 1-3.5 శాతానికి తగ్గించడం విశేషం. నొమురా సైతం పోర్టుఫోలియోలో కొన్ని షేర్లను అమ్ముకోవాలని సూచించింది. అయితే టార్గెట్‌ను రూ.1210కి తగ్గించింది