International Gemmological Institute: NSEలో IPO ధర కంటే 23% ప్రీమియంతో ఇంటర్నేషనల్ జెమ్మోలాజికల్ ఇన్స్టిట్యూట్ షేర్ల జాబితా
ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇనిస్టిట్యూట్ తమ షేర్లను నేడు మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎన్‌ఎస్‌ఈలో షేర్లు రూ.510 వద్ద ప్రారంభమయ్యాయి, ఇష్యూ ధరతో పోలిస్తే 22 శాతం ప్రీమియంతో లిస్టయాయి. అలాగే, బీఎస్‌ఈలో షేర్లు 21.06 శాతం లాభంతో రూ.504.85 వద్ద లిస్టయ్యాయి.
సబ్‌స్క్రిప్షన్ మొదలైన రోజునే మంచి స్పందన
ప్రపంచంలోని ప్రముఖ డైమండ్ గ్రేడింగ్ సంస్థ అయిన ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇనిస్టిట్యూట్ తన పబ్లిక్ ఇష్యూకు రూ.4,225 కోట్ల సమీకరణ లక్ష్యంగా రంగ ప్రవేశం చేసింది. ఈ ఐపీఓకు ధర శ్రేణి రూ.397-417గా నిర్ణయించారు. సబ్‌స్క్రిప్షన్ మొదలైన రోజునే మంచి స్పందన వచ్చింది, చివరిరోజున 34 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.1475 కోట్ల తాజా షేర్లను జారీ చేయాలని, అలాగే ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా 6.59 కోట్ల షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. మెరుగైన లిస్టింగ్ ఫలితంగా, కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.22,040.14 కోట్లకు చేరుకుంది.