Iran-Israel conflict: యుద్ధం ఎక్కడో.. దెబ్బ ఇక్కడ! ముంబై, NCR,బెంగళూరులలో చుక్కలు చూపిస్తున్న రియల్ ఎస్టేట్..
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ ప్రభావం ఇప్పుడు భారత రియల్ ఎస్టేట్ రంగంపై పడుతోంది. ముఖ్యంగా స్టీల్ ధరలు భారీగా పెరగడం డెవలపర్లకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా హై-రైజ్, లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులు దీనితో ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. స్టీల్ ధరల పెరుగుదలతో పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు ANAROCK అంచనాల ప్రకారం, స్టీల్ ధరలు సుమారు 20 శాతం వరకు పెరిగి టన్నుకు రూ. 72,000 వరకు చేరాయి. సరఫరా అంతరాయం, షిప్పింగ్ ఖర్చులు పెరగడం, యుద్ధ పరిస్థితుల వల్ల లాజిస్టిక్స్ సమస్యలు ఇందుకు ప్రధాన కారణాలు. ఈ పెరుగుదల ఇప్పటికే ప్రధాన నగరాల్లో నిర్మాణ ఖర్చులపై ప్రభావం చూపుతోంది.
వివరాలు
స్టీల్ ధరల పెరుగుదలతో పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు
దేశంలోనే అతిపెద్ద హై-రైజ్ మార్కెట్ అయిన ముంబైలో స్టీల్ ధరల పెరుగుదల వల్ల ఒక్క చదరపు అడుగుకు సుమారు రూ. 50 వరకు ఖర్చు పెరుగుతోంది. ఇదే పరిస్థితి ఢిల్లీ-NCR, బెంగళూరు వంటి కీలక నగరాల్లో కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హై-రైజ్ భవనాల్లో స్టీల్ కీలక భాగం. అందువల్ల గ్లోబల్ మార్కెట్‌లో ధరల మార్పులకు ఇది ఎక్కువగా ప్రభావితమవుతుంది. ప్రస్తుత పెరుగుదలకు సరఫరా గొలుసు అంతరాయం, రవాణా ఖర్చుల పెరుగుదల, ఇంధన ధరల ప్రభావం వంటి అంశాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
స్టీల్ ధరల పెరుగుదలతో పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు
ANAROCK గ్రూప్‌లో రీసెర్చ్ & అడ్వైజరీ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ మాట్లాడుతూ, 2026 మార్చి ప్రారంభం నుంచి హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద ఏర్పడిన అడ్డంకులు రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. దీంతో నిర్మాణ సామగ్రి ఖర్చులు పెరగడం, సరఫరా ఆలస్యం, కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం కావడం లేదా నిలిచిపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. "సాధారణ అంచనా ప్రకారం,ముంబైలో హై-రైజ్ భవనాల నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు సుమారు రూ. 50 వరకు పెరిగింది. ప్రస్తుతం అక్కడ 10,000కి పైగా లగ్జరీ యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. స్కైస్క్రేపర్లలో స్టీల్ రాడ్లు ప్రధానంగా ఉపయోగిస్తారు.
వివరాలు
స్టీల్ ధరల పెరుగుదలతో పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు
అందువల్ల స్టీల్ ధరల పెరుగుదల నిర్మాణ ఖర్చుతో పాటు ప్రాజెక్టుల పూర్తికి కూడా ఆలస్యం కలిగిస్తుంది," అని ఆయన తెలిపారు. అదేవిధంగా నిర్మాణంలో ఉపయోగించే క్రేన్లు, మిక్సర్ల కోసం డీజిల్ ఖర్చులు కూడా బ్రెంట్ క్రూడ్ ధరలు $100 దాటడంతో పెరిగాయని చెప్పారు. దీని ప్రభావం ముంబై, ఢిల్లీ-NCR, హైదరాబాద్ వంటి నగరాల్లో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ప్రస్తుతం హాట్ రోల్డ్ కాయిల్ ధరలు టన్నుకు రూ. 51,000 నుంచి రూ. 56,000 మధ్య ఉన్నాయి. పరిస్థితి మారకపోతే జూన్ నాటికి ఇవి రూ. 62,000 వరకు చేరే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
వివరాలు
NCR, బెంగళూరులో కూడా ప్రభావం
ఇదే తరహా ఒత్తిడి ఢిల్లీ-NCR, బెంగళూరు వంటి నగరాల్లో కూడా కనిపిస్తోంది. గురుగ్రామ్,నోయిడా వంటి ప్రాంతాల్లో లగ్జరీ, హై-రైజ్ ప్రాజెక్టులు ఎక్కువగా ఉండటంతో నిర్మాణ ఖర్చులు చదరపు అడుగుకు రూ. 40 నుంచి రూ. 60 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్లాస్ ఫసాడ్లు, క్లిష్టమైన డిజైన్ ఉన్న లగ్జరీ టవర్స్‌లో ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. బెంగళూరులో మధ్యస్థ, హై-రైజ్ ప్రాజెక్టులు ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రభావం కొంత తక్కువగా ఉన్నప్పటికీ, చదరపు అడుగుకు రూ. 30 నుంచి రూ. 50 వరకు ఖర్చు పెరగవచ్చని అంచనా. ఇప్పటికే హౌసింగ్ అమ్మకాలు తగ్గుతున్న సమయంలో డెవలపర్లు మరింత కష్టతర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఠాకూర్ పేర్కొన్నారు.
వివరాలు
తాత్కాలిక ప్రభావమేనా?
అయితే పరిశ్రమ వర్గాలు ప్రస్తుతం పరిస్థితి తాత్కాలికమని భావిస్తున్నాయి. CREDAI అధ్యక్షుడు శేఖర్ పటేల్ మాట్లాడుతూ, ప్రస్తుత భౌగోళిక పరిస్థితుల మధ్య కూడా భారత రియల్ ఎస్టేట్ రంగం స్థిరంగానే ఉందన్నారు. "ప్రస్తుతం గ్లోబల్ ఇంధన ధరల మార్పుల వల్ల సరఫరా గొలుసులో తాత్కాలిక అంతరాయం మాత్రమే కనిపిస్తోంది. గుజరాత్‌లోని మోర్బి వంటి మార్బుల్, టైల్ తయారీ కేంద్రాల్లో ఇంధన కొరత, లాజిస్టిక్స్ సమస్యల వల్ల కొంత ప్రభావం ఉంది. అయితే ఇవి తాత్కాలికమే," అని తెలిపారు. అయితే ఈ పరిస్థితి నెలరోజులకంటే ఎక్కువ కొనసాగితే నిర్మాణ సామగ్రి ఖర్చులు మరింత పెరిగి, మొత్తం ప్రాజెక్టుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.