LOADING...
RBI: 50 పైసలు చెల్లుబాటు అవుతుందా.. కాదా? క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
50 పైసలు చెల్లుబాటు అవుతుందా.. కాదా? క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

RBI: 50 పైసలు చెల్లుబాటు అవుతుందా.. కాదా? క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పౌరులకు నకిలీ నోట్ల గుర్తింపు, కరెన్సీ సంబంధిత వదంతులపై ఎప్పటికప్పుడూ అవగాహన కల్పిస్తూ ఉంటుంది. తాజా చర్యతో నాణేలపై ప్రజల అపోహలను తొలగించడానికి ఆర్‌బీఐ ప్రత్యేకంగా వాట్సప్ (WhatsApp) ద్వారా వ్యక్తిగత సందేశాలు పంపుతోంది. అలాగే నాణేల గురించి అవగాహన కల్పించే ఓ వీడియోను కూడా విడుదల చేసింది. వాట్సప్ సందేశంలో RBI స్పష్టం చేసినట్టే, నాణేలు వేర్వేరు డిజైన్లతో ఉన్నా అవన్నీ చెల్లుబాటు అయ్యే కరెన్సీగా కొనసాగుతున్నాయని తెలిపారు.

Details

రూ.1 నుంచి రూ.20 వరకు నాణేలు చట్టబద్ధం

50 పైసల నుండి రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 వరకు ఉన్న నాణేలన్నీ చట్టబద్ధమైనవి, భవిష్యత్తులో కూడా చలామణిలో ఉంటాయని పేర్కొన్నారు. RBI పౌరులను నాణేల గురించి తప్పుదారి పట్టించే సమాచారం లేదా వదంతులను విశ్వసించవద్దని హెచ్చరించింది. అలాగే వ్యాపారులను కూడా సంకోచించకుండా పౌరుల నుంచి నాణేలను స్వీకరించమని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా రూ.10 నాణేల విషయంలో ఇప్పటికే RBI అవగాహన కల్పించినప్పటికీ, కొందరు వ్యాపారులు వాటిని తీసుకోవడంలో ఇంకా సంకోచిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా, పాతకాలగర్భంలో కలిసిపోయిన 50 పైసల నాణేలు కూడా చెల్లుబాటులోనే ఉంటాయని ఆర్ బి ఐ మరోసారి స్పష్టంచేసింది.

Advertisement