LOADING...
Bank Account: బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా? ఈ స్టెప్స్ ఫాలో అయితే వెంటనే యాక్టివేట్!
బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా? ఈ స్టెప్స్ ఫాలో అయితే వెంటనే యాక్టివేట్!

Bank Account: బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా? ఈ స్టెప్స్ ఫాలో అయితే వెంటనే యాక్టివేట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2026
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్ని సందర్భాల్లో బ్యాంకులు కస్టమర్ల ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తుంటాయి. అకస్మాత్తుగా డబ్బులు విత్‌డ్రా కావడం లేదని, అకౌంట్‌ హోల్డ్‌లో పడిపోయిందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఖాతా ఫ్రీజ్‌ అయితే అందులో ఉన్న సొమ్మును ఉపసంహరించుకోవడం సాధ్యం కాదు. దీనికి పలు కారణాలు ఉంటాయి. మోసపూరిత లావాదేవీలు, కేవైసీ పూర్తి కాకపోవడం, అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు వంటి అంశాల వల్ల ఖాతా నిలిపివేయబడే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ అకౌంట్‌లో ఒక్కసారిగా భారీ మొత్తంలో నగదు జమైతే కూడా కొన్నిసార్లు ఆటోమేటిక్‌గా ట్రాన్సాక్షన్లు ఆగిపోతాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అధికారులను సంప్రదించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Details

ముందుగా కారణం తెలుసుకోండి

అకౌంట్‌ ఫ్రీజ్‌ అయిన వెంటనే దానికి కారణం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. బ్యాంక్ మొబైల్‌ యాప్‌లో లాగిన్‌ అయి వివరాలు పరిశీలించవచ్చు. అలాగే నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా కూడా కారణం చెక్‌ చేయవచ్చు. అక్కడ 'డెబిట్ బ్లాక్‌డ్', 'కంప్లయెన్స్ ఇష్యూ' వంటి సందేశాలు కనిపించవచ్చు. ఆ వివరాలు స్పష్టంగా అర్థం కాకపోతే కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఖాతా పూర్తిగా బ్లాక్‌ అయ్యిందా? లేక పాక్షికంగా నిలిపివేశారా? అన్నది నిర్ధారించుకోవాలి. కారణం తెలిసిన తర్వాత దాన్ని ఎలా పరిష్కరించాలో బ్యాంక్ సిబ్బంది సూచనలు ఇస్తారు. వారు చెప్పిన ప్రక్రియను అనుసరిస్తే ఖాతా తిరిగి యాక్టివ్‌ అవుతుంది.

Details

ఖాతా యాక్టివేషన్‌ కోసం చేయాల్సినవి

కేవైసీ గడువు ముగిసిన కారణంగా ఖాతా ఫ్రీజ్‌ అయితే ఆధార్‌ రీ-వెరిఫికేషన్‌ చేయాలి. పాన్‌ కార్డు లింక్‌ చేయడం, చిరునామా వివరాలు నవీకరించడం వంటి ప్రక్రియలు పూర్తి చేయాలి. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత సాధారణంగా రెండు నుంచి మూడు రోజుల్లో ఖాతా తిరిగి పనిచేయడం ప్రారంభమవుతుంది. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు జమ కావడంతో ఖాతా నిలిపివేసినట్లయితే, ఆ డబ్బుకు సంబంధించిన ఆధారాలను బ్యాంక్‌కు సమర్పించాలి. అలాగే ఆదాయపు పన్ను నోటీసులు లేదా కోర్టు ఆదేశాల కారణంగా ఖాతా ఫ్రీజ్‌ అయితే, సంబంధిత సమస్య పరిష్కారమైన తర్వాత రిలీజ్‌ ఆర్డర్‌ను బ్యాంక్‌కు అందజేయాలి.

Advertisement

Details

గ్రీవెన్స్‌ సెల్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు

బ్యాంక్ సిబ్బంది అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా ఖాతా తిరిగియాక్టివేట్‌ కావడానికి సహకారం లభిస్తుంది. అయినా కూడా బ్యాంక్ పేర్కొన్న గడువు దాటినా ఖాతా యాక్టివ్‌ కాకపోతే, నోడల్‌ ఆఫీసర్‌ లేదా గ్రీవెన్స్‌ సెల్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. సరైన చర్యలు తీసుకుంటే మీ ఖాతాను తిరిగి పొందడం సాధ్యమే.

Advertisement