Page Loader
2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల
2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల

2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల

వ్రాసిన వారు Stalin
Apr 26, 2023
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆదాయపు పన్ను శాఖ ఇంకా ఆన్‌లైన్ ఐటీఆర్ ఫారమ్‌లను విడుదల చేయనప్పటికీ, 2023-24 లేదా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి ఆఫ్‌లైన్ ఐటీఆర్-1, 4 ఫామ్స్‌ను విడుదల చేసింది. ఆఫ్‌లైన్ పద్ధతిలో పన్ను చెల్లింపుదారులు సంబంధిత ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, నింపి, ఆపై దానిని డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. అయితే ఆన్‌లైన్ ఫారమ్‌లో, పన్ను చెల్లింపుదారులు నేరుగా ఆదాయపు పన్ను పోర్టల్‌లో తమ ఆదాయానికి సంబంధించిన వివరాలను పూరించాల్సి ఉంటుంది.

ఐటీ

ఐటీఆర్-1, ఐటీఆర్ -4‌ఫామ్‌లను ఎవరు సమర్పించాలంటే?

ఐటీఆర్-1 ఫామ్‌ను రూ. 50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తి దాఖలు చేయవచ్చు. జీతాల ద్వారా ఆదాయం, ఒక ఇంటి ఆస్తి, ఇతర వనరులు(వడ్డి) ద్వారా ఆదాయం, రూ. 5,000 వరకు వ్యవసాయ ఆదాయం కలిగి కలిగి ఉన్నవారు ఐటీఆర్-1ను సమర్పించాలి. ఐటీఆర్ -4‌ఫామ్‌ను వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), వ్యాపారాల నుంచి రూ. 50 లక్షల వరకు సంపాదించే సంస్థలు దాఖలు చేయవచ్చు. 44AD, 44ADA, 44AE సెక్షన్ల కింద వ్యవసాయ ఆదాయం రూ. 5,000 వరకు ఉన్నవారు ఐటీఆర్ -4‌ఫామ్‌ను సమర్పించాలి.