LOADING...
ITC Hotels: రూ.180 వద్ద అరంగేట్రం చేసిన ITC హోటల్స్.. 11% ప్రీమియంతో ఎంట్రీ ఇచ్చిన డెంటా వాటర్‌
రూ.180 వద్ద అరంగేట్రం చేసిన ITC హోటల్స్..

ITC Hotels: రూ.180 వద్ద అరంగేట్రం చేసిన ITC హోటల్స్.. 11% ప్రీమియంతో ఎంట్రీ ఇచ్చిన డెంటా వాటర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐటీసీ హోటల్స్‌ లిమిటెడ్‌ షేర్లు నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయ్యాయి. బీఎస్ఈలో ఈ షేర్లు రూ.188 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో రూ.180 వద్ద ప్రారంభమయ్యాయి. ఐటీసీ లిమిటెడ్‌ అనేక వ్యాపార రంగాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంస్థ, అయితే గత సంవత్సరంలో ఆతిథ్య వ్యాపారాన్ని విడదీసి, 'ఐటీసీ హోటల్స్‌' పేరుతో ఓ ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చాలని నిర్ణయించింది. ప్రతీ 10 ఐటీసీ షేర్లకు ఒక ఐటీసీ హోటల్స్‌ షేరు కేటాయించడం జరిగింది. ఈ షేర్లు ఇప్పుడు స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయి ఉన్నాయి. ఈ కొత్త సంస్థలో ఐటీసీకి సుమారు 40 శాతం వాటా ఉన్నదని, మిగతా 60 శాతం వాటా కంపెనీ వాటాదార్లకు చెందుతుందని సమాచారం.

వివరాలు 

డెంటా వాటర్‌ అరంగేట్రం 

వాటర్‌,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సొల్యూషన్‌ కంపెనీ అయిన డెంటా వాటర్‌ (Denta Water) షేర్లు బుధవారం స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయ్యాయి. సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియలో మంచి ఆదరణ పొందిన ఈ కంపెనీ షేర్లు స్వల్ప లాభంతో దలాల్‌ స్ట్రీట్‌లో తమ ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఇష్యూ ధర రూ.294తో పోల్చితే, ఈ షేర్లు 10.54 శాతం ప్రీమియంతో ఎన్‌ఎస్‌ఈలో రూ.325 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. అలాగే, బీఎస్‌ఈలో 12.24 శాతం ప్రీమియంతో రూ.330 వద్ద లిస్ట్‌ అయ్యాయి.