Page Loader
Jio Financial:జియో పేమెంట్‌ సొల్యూషన్స్‌కు RBI అనుమతి: కొత్త సేవలు, డిజిటల్‌ గోల్డ్ 
జియో పేమెంట్‌ సొల్యూషన్స్‌కు RBI అనుమతి: కొత్త సేవలు, డిజిటల్‌ గోల్డ్

Jio Financial:జియో పేమెంట్‌ సొల్యూషన్స్‌కు RBI అనుమతి: కొత్త సేవలు, డిజిటల్‌ గోల్డ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2024
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన జియో పేమెంట్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ (JSPL) ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ అగ్రిగేటర్‌గా కొనసాగేందుకు భారత రిజర్వు బ్యాంకు (RBI) నుండి అనుమతి పొందింది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా తెలియజేసింది. అక్టోబర్‌ 28 నుంచి ఈ అనుమతి చెల్లుబాటు అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ సమయంలో, జియో ఫైనాన్షియల్‌ షేరు నేడు రాణించింది, ఎన్‌ఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ.323 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

డిజిటల్‌ గోల్డ్ కొనుగోలు: స్మార్ట్‌ గోల్డ్ సదుపాయం 

ధన త్రయోదశి(Dhanteras)సందర్భంగా, జియో ఫైనాన్షియల్‌ సంస్థ నూతన సేవలకు శ్రీకారం చుట్టింది. జియో ఫైనాన్షియల్‌ యాప్‌ ద్వారా వినియోగదారులు సులభంగా డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేసేందుకు 'స్మార్ట్‌ గోల్డ్‌' సదుపాయాన్ని ప్రారంభించింది. వినియోగదారులు తమ యాప్‌ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేయవచ్చు. ఇందులో రూ.10 నుంచి పెట్టుబడి పెట్టడం సాధ్యమవుతోంది. వారు డిజిటల్‌ గోల్డ్‌ను క్యాష్ లేదా ఫిజికల్‌ గోల్డ్‌ రూపంలో పొందవచ్చు.

వివరాలు 

జియో-బ్లాక్‌రాక్‌ జాయింట్‌ వెంచర్‌ 

జియో ఫైనాన్షియల్‌ సంస్థ, బ్లాక్‌రాక్‌తో కలిసి రెండు జాయింట్‌ వెంచర్‌ కంపెనీలను ఏర్పాటుచేయాలని ప్రకటించింది. జియో బ్లాక్‌రాక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జియో బ్లాక్‌రాక్‌ ట్రస్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలను స్థాపించడానికి కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి సర్టిఫికెట్‌ పొందినట్లు ఇరు కంపెనీలు వెల్లడించాయి. నియంత్రణ సంస్థల ఆమోదానికి అనుగుణంగా, మ్యూచువల్‌ ఫండ్‌ కార్యకలాపాలను త్వరలో ప్రారంభించడానికి యోచిస్తున్నారు.