LOADING...
Income tax return: డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన కీలక ఆర్థిక పనులు ఇవే..
డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన కీలక ఆర్థిక పనులు ఇవే..

Income tax return: డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన కీలక ఆర్థిక పనులు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2025
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త ఏడాదికి స్వాగతం పలికే సమయం దగ్గరపడుతోంది. 2025 ముగిసేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సరానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 అనేది కేవలం క్యాలెండర్ సంవత్సరం ముగిసే తేదీ మాత్రమే కాదు. పన్ను చెల్లింపుదారులు సహా సాధారణ పౌరులు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన కొన్ని కీలక ఆర్థిక పనులకు ఇదే చివరి గడువు. అందువల్ల ఈ నెలాఖరులోపు పూర్తి చేయాల్సిన పనులు ఏవో, వాటి ప్రాధాన్యం ఏమిటో తెలుసుకోవడం అత్యంత అవసరం.

వివరాలు 

1. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ దాఖలు

ట్యాక్స్ ఆడిట్ పరిధిలోకి వచ్చే కేసుల విషయంలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) డిసెంబర్ 10, 2025 వరకు పొడిగించింది. అదనపు ఆర్థిక వివరాలు సమర్పించాల్సిన వారికి ఈ నిర్ణయం కొంత ఊరటను కలిగించింది. అయితే ఇప్పటికీ ఐటీఆర్ దాఖలు చేయని వారు డిసెంబర్ 31 లోపు ఆలస్య రిటర్న్‌గా ('బిలేటెడ్ ఐటీఆర్') దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంలో భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

వివరాలు 

2. పాన్-ఆధార్ అనుసంధానం

అక్టోబర్ 1, 2024కి ముందే ఆధార్ కార్డు పొందినప్పటికీ ఇంకా పాన్‌తో లింక్ చేయని వారు డిసెంబర్ 31లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. నిర్ణీత గడువులోపు లింక్ చేయకపోతే, జనవరి 1, 2026 నుంచి పాన్ కార్డు అమాన్యంగా మారే అవకాశం ఉంది. దాంతో బ్యాంకింగ్ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, ఆదాయపు పన్ను రీఫండ్‌లు వంటి అనేక ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవచ్చు.

Advertisement

వివరాలు 

3. బిలేటెడ్ & రివైజ్డ్ ఐటీఆర్ అవకాశం

ఆర్థిక సంవత్సరం 2024-25 (అసెస్‌మెంట్ ఇయర్ 2025-26)కు సంబంధించి ఇప్పటి వరకు ఐటీఆర్ ఫైల్ చేయని వారికి డిసెంబర్ 31 చివరి అవకాశం. ఈ తేదీలోపు బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఇందుకు గరిష్టంగా రూ. 5,000 వరకు ఆలస్య రుసుము విధిస్తారు. రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఇది రూ. 1,000 మాత్రమే. ఇప్పటికే రిటర్న్ దాఖలు చేసి, అందులో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే, అదే గడువులోపు రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేసి సరిదిద్దుకోవచ్చు. జనవరి 1 తర్వాత 'ITR-U' మాత్రమే ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు చెల్లించాల్సిన పన్నుపై 25 శాతం నుంచి 50 శాతం వరకు అదనపు పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది.

Advertisement

వివరాలు 

4. అడ్వాన్స్ టాక్స్ మూడో విడత

ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించిన అడ్వాన్స్ టాక్స్ మూడవ విడతను (మొత్తం పన్నులో 75 శాతం వరకు) డిసెంబర్ 15 లోపు చెల్లించాల్సి ఉండేది. ఈ గడువు ముగిసినప్పటికీ, పెనాల్టీ వడ్డీ భారం తగ్గించుకోవాలంటే వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని చెల్లించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వివరాలు 

5. జీఎస్టీ రిటర్న్స్ & బ్యాంక్ లాకర్ నిబంధనలు

వ్యాపారులు, సంస్థలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక జీఎస్టీ రిటర్న్స్‌ను డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా దాఖలు చేయాలి. టర్నోవర్ పరిమితిని బట్టి ఈ రిటర్న్స్ వర్తిస్తాయి. నిర్ణీత గడువు దాటితే ప్రతిరోజూ జరిమానా విధించబడుతుంది. మరోవైపు,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం బ్యాంక్ లాకర్ తీసుకున్న ఖాతాదారులు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసి బ్యాంకులకు సమర్పించేందుకు కూడా ఈ నెలాఖరే చివరి తేదీగా ఉంది. ఇవే కాకుండా, మీ బ్యాంక్ ఖాతాలు, బీమా పాలసీల్లో నామినీల వివరాలను అప్‌డేట్ చేసుకోవడం కూడా మర్చిపోకూడదు. చివరి నిమిషంలో సర్వర్ డౌన్‌లు లేదా సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే, ఈ అన్ని ఆర్థిక పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం.

Advertisement