Loading...
Lalithaa Jewellery IPO: లలితా జువెలరీ ఐపీఓతో మదుపర్లకు లాభాల పంట.. 32 శాతం ప్రీమియం
లలితా జువెలరీ ఐపీఓతో మదుపర్లకు లాభాల పంట.. 32 శాతం ప్రీమియం

Lalithaa Jewellery IPO: లలితా జువెలరీ ఐపీఓతో మదుపర్లకు లాభాల పంట.. 32 శాతం ప్రీమియం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జువెలరీ మార్ట్‌ ఐపీఓ స్టాక్‌ మార్కెట్‌లో ఘనంగా అరంగేట్రం చేసింది. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 32 శాతం ప్రీమియంతో కంపెనీ షేర్లు లిస్టయ్యాయి. దీంతో ఐపీఓలో షేర్లు దక్కించుకున్న మదుపర్లకు లిస్టింగ్‌ రోజే మంచి లాభాలు లభించాయి.

వివరాలు 

బీఎస్‌ఈలో రూ.265.30 వద్ద షేర్ల ప్రారంభం

లలితా జువెలరీ ఐపీఓ ఇష్యూ ధరను రూ.201గా నిర్ణయించారు.

దీనితో పోలిస్తే బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 31.99 శాతం ప్రీమియంతో రూ.265.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఎన్‌ఎస్‌ఈలోనూ షేర్లకు మంచి స్పందన లభించింది.

అక్కడ 31.84 శాతం ప్రీమియంతో రూ.265 వద్ద లిస్టయ్యాయి. ఈ ఘనమైన లిస్టింగ్‌తో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.14,462.90 కోట్లకు చేరింది.

వివరాలు 

62.97 రెట్లు సబ్‌స్క్రిప్షన్

లలితా జువెలరీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ ఆగస్టు 17న ప్రారంభమై.. ఆగస్టు 19న ముగిసింది.

ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.190 నుంచి రూ.201గా నిర్ణయించారు. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.1,700 కోట్లు సమీకరించింది.

ఇందులో రూ.1,200 కోట్లు ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా, మరో రూ.500 కోట్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) ద్వారా సమీకరించింది.

ఈ ఐపీఓకు మదుపర్ల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 62.97 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ నమోదైంది.

ఐపీఓకు ముందే యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ మరో రూ.508 కోట్లు సమీకరించింది.

ADVERTISEMENT

వివరాలు 

1985లో లలితా జువెలరీ ప్రస్థానం

లలితా జువెలరీ తన వ్యాపార ప్రస్థానాన్ని 1985లో చెన్నైలోని టీనగర్‌లో ప్రారంభించింది.

ఆ తర్వాత ఆభరణాల రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగింది. సంస్థ అధినేత కిరణ్‌ కుమార్‌ 'డబ్బులు ఎవరికీ ఊరికే రావు' అనే స్లోగన్‌తో విస్తృతంగా గుర్తింపు పొందారు. ఈ నినాదం లలితా జువెలరీ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

గమనిక: ఈ వార్త/కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులను ఈనాడు.నెట్‌ ప్రోత్సహించడం లేదు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించడం మంచిది.

ADVERTISEMENT