Gold Prices: పడిపోయిన పసిడి రేటు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. వారంలో తొలి రోజైన సోమవారం పసిడి ధరలు పతనమవడం కొనుగోలు చేసేవారికి ఊరట కలిగించింది. గత రెండు రోజులుగా పెరుగుదల కనిపించిన ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టి ఉపశమనం ఇచ్చాయి. ఈ తగ్గుదల తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,460గా ఉంది. ఇది ఆదివారం నమోదైన రూ.1,52,840తో పోలిస్తే రూ.380 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,750 వద్ద ఉండగా, నిన్నటి రూ.1,40,100తో పోలిస్తే రూ.350 తగ్గింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
వివరాలు
బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,380గా ఉండగా,ఆదివారం రూ.1,53,820తో పోలిస్తే రూ.440 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,600గా ఉండగా, నిన్నటి రూ.1,41,000తో పోలిస్తే రూ.400 తగ్గింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,460గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,39,750 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,610గా ఉండగా,నిన్నటి రూ.1,52,990తో పోలిస్తే తగ్గుదల నమోదైంది. అక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,900గా ఉంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ఉండగా,నిన్నఇది రూ.2.60లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.60 లక్షల వద్ద ఉండగా,ఆదివారం రూ.2.65లక్షలుగా నమోదైంది.