LOADING...
Gold Prices: మరోసారి కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీ పతనం.. తాజా గోల్డ్,సిల్వర్ రేట్లు ఇవే
తాజా గోల్డ్,సిల్వర్ రేట్లు ఇవే

Gold Prices: మరోసారి కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీ పతనం.. తాజా గోల్డ్,సిల్వర్ రేట్లు ఇవే

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 06, 2026
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి సోమవారం మంచి ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజులుగా పెరుగుతున్న ధరలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పడిపోయాయి. దీంతో కొనుగోలుదారుల్లో కొంత ఉపశమనం కనిపిస్తోంది. ఇక వివిధ నగరాల్లో తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,49,130 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇదే ధర రూ.1,50,930గా ఉండగా, ఒక్క రోజులోనే రూ.1,800 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,700గా ఉంది. నిన్న ఇది రూ.1,38,350గా ఉండగా, రూ.1,650 తగ్గింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా హైదరాబాద్‌తో సమానంగానే ధరలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

వెండి ధరలు 

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,170గా ఉంది. నిన్న రూ.1,52,180గా ఉండగా స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల ధర రూ.1,39,490గా ఉండగా,నిన్న రూ.1,39,500గా ఉంది.బెంగళూరులో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అక్కడ 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,49,130గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,36,700 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,280గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,850గా నమోదైంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే, ఢిల్లీలో కిలో వెండి రూ.2.50 లక్షలుగా ఉంది. చెన్నైలో ఇది రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది.బెంగళూరులో రూ.2.50 లక్షలు కాగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది.

Advertisement