Elon Musk : ట్విట్‌లతో 'X.COM'లో డబ్బులు సంపాదించడానికి నిబంధనలు ఇవే
ట్విట్టర్ (x.com) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు గుడ్ న్యూస్ ను అందించాడు. ట్విట్ లతో డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించాడు. దీని కోసం మస్క్ యాడ్ రెవెన్యూ షేరింగ్ ఫీచర్ ను డెవలప్ చేశారు. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు ఎక్స్ డాట్ కామ్‌లో చేసే ట్విట్‌లపై యూజర్ల ఎంగేజ్ మెంట్ ఆధారంగా యాడ్స్ ప్రత్యక్షమవుతాయి. వాటికి అనుగుణంగా యూజర్లు డబ్బులు సంపాదించే వీలు ఉంటుంది. కంటెంట్ క్రియేటర్లు ఈ ఫీచర్ సాయంతో సోషల్ మీడియా(X.Com) ప్లాట్ ఫామ్‌లో నేరుగా డబ్బులు సంపాదించుకోవచ్చని ప్రకటించింది. ఈ ఫీచర్ భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చింది.
రెవెన్యూ షేరింగ్ నిబంధనలను ఉల్లంఘించరాదు
ఎక్స్ డాట్ కామ్‌లో రెవెన్యూ షేరింగ్ ఫీచర్ పొందాలంటే ముందుగా ట్విటర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ ఉండాలి. మూడు నెలల లోపల యూజర్లు చేసిన ట్విట్ లపై 15 మిలియన్ ఇంప్రెషన్స్, 500 మంది ఫాలోవర్స్ తప్పనిసరిగా ఉండాలి. యూజర్లు కంపెనీ ప్రకటనల నిబంధనలను కూడా పాటించాలి. రెవెన్యూ షేరింగ్ నిబంధలను ఉల్లంఘిస్తే ఎక్స్ డాట్ కామ్ ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉండదు. డబ్బులను క్లెయిమ్ చేసుకోవాలంటే ఎక్స్ డాట్ కామ్ లోని ట్విట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. అప్పుడు మానిటైజేషన్ అనే ఆప్షన్ వస్తుంది. సైడు మెనూలో 'జాయిన్ అండ్ పే అవుట్ సెటప్' అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే పేమెంట్ ప్రాసెసింగ్ అవుతుంది.