Lenskart IPO listing: ఎంట్రీలో నిరాశపర్చిన లెన్స్‌కార్ట్.. ఇష్యూ ధర కంటే తక్కువకు లిస్టింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ కళ్లద్దాల విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే, దలాల్ స్ట్రీట్‌లో మొదటి రోజే ఈ షేర్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాయి. ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.402గా నిర్ణయించగా,ఎన్ఎస్ఈలో రూ.395కు(రూ.7 తగ్గుదలతో),బిఎస్ఈలో రూ.390కు(రూ.12తగ్గుదలతో) లిస్ట్ అయ్యాయి. ఈ కంపెనీ మొత్తం రూ.7,278 కోట్ల నిధులను సమీకరించడానికి భాగంగా 9.97 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా,మొత్తం 281కోట్ల షేర్లకు బిడ్లు లభించాయి. ఐపీఓలో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ కోటా 40.35 రెట్లు,నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 18.23 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల భాగం కూడా 7.54రెట్లు డిమాండ్‌ను సాధించింది.ఒక్కో షేరు ధరను కంపెనీ రూ.382 నుంచి రూ.402 మధ్యగా నిర్ణయించింది.
వివరాలు
సీఈవో ఎమోషనల్ పోస్ట్..
ఇదే సమయంలో, కంపెనీ డిసెంబర్ చివరినాటికి ఏఐ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలను మార్కెట్లోకి తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ లిస్టింగ్ వేళ లెన్స్‌కార్ట్ సీఈవో పీయూష్ బన్సల్ (Peyush Bansal) ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. "లెన్స్‌కార్ట్ దలాల్ స్ట్రీట్‌లో గంట మోగించబోతోంది. ఇది మా ప్రయాణానికి ముగింపు కాదు, అసలు కొత్త అధ్యాయం మొదలు. ఈ ప్రయాణంలో భారతదేశం ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆశిస్తున్నాం. మీరు ఎప్పుడైనా లెన్స్‌కార్ట్ కళ్లజోడు ధరించి ఉంటే, దాని ఫోటో తీసి #VisionForBillion హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయండి." అలాగే, కంపెనీ ఎదుగుదలలో తమ టీమ్‌కు, అలాగే వినియోగదారులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.