LOADING...
Insurance Sakhi: మహిళలకు ఎల్ఐసీ బీమా సఖి పథకం… శిక్షణ సమయంలోనే నెలకు రూ.7వేలు
మహిళలకు ఎల్ఐసీ బీమా సఖి పథకం… శిక్షణ సమయంలోనే నెలకు రూ.7వేలు

Insurance Sakhi: మహిళలకు ఎల్ఐసీ బీమా సఖి పథకం… శిక్షణ సమయంలోనే నెలకు రూ.7వేలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2026
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగం కోసం చూస్తున్న మహిళలకు, సొంత కాళ్లపై నిలబడాలనుకునేవారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో LIC ప్రారంభించిన బీమా సఖి పథకం ఒక కొత్త అవకాశం. ఈ పథకం ద్వారా మహిళలు బీమా రంగంలో కెరీర్ ప్రారంభించగలరట, అదే సమయంలో శిక్షణ సమయంలోనూ నెలవారీ ఆదాయం పొందే అవకాశం కలుగుతుంది. పథకం ప్రధాన లక్ష్యం. మహిళలను ఆర్థికంగా సాధికారికంగా మార్చడం. LIC ఎంపిక చేసిన మహిళలకు ఏజెంట్లుగా పనిచేయడానికి పూర్తి స్థాయి శిక్షణ అందిస్తారు. ముఖ్యంగా శిక్షణ సమయంలోనూ వారికి నిర్దిష్ట నెలవారీ భత్యం ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకత.

Details

భత్యాల వివరాలు

మొదటి సంవత్సరం: నెలకు రూ.7,000 రెండో సంవత్సరం: నెలకు రూ.6,000 మూడో సంవత్సరం: నెలకు రూ.5,000 శిక్షణ పూర్తయ్యాక మహిళలు పూర్తి స్థాయి LIC ఏజెంట్లుగా పాలసీలు విక్రయించి, కమిషన్ రూపంలో అదనపు ఆదాయం పొందవచ్చు.

Details

పథకం ప్రత్యేకతలు

గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు ఉన్న సాధారణ మహిళలు సులభంగా లబ్ధి పొందగలరు. విద్యార్హతలో పెద్ద అడ్డంకి లేదు - గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. వయోపరిమితి: 18 నుండి 70 సంవత్సరాల మధ్య. LICలో ఇప్పటికే ఉద్యోగిగా లేదా ఏజెంట్‌గా పనిచేస్తున్న మహిళలు ఈ పథకానికి అర్హులు కారు.

Advertisement

Details

దరఖాస్తు విధానం

మహిళలు సమీప LIC కార్యాలయాన్ని సందర్శించి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. LIC అధికారిక వెబ్‌సైట్‌లో బీమా సఖీ ఎంపికపై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ నింపాలి. 10వ తరగతి సర్టిఫికేట్, వయస్సు రుజువు, నివాస రుజువు వంటి పత్రాలు సమర్పించి ఫారమ్ పూర్తి చేయాలి. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన, కెరీర్ అభివృద్ధి, నెలవారీ ఆదాయం వంటి అనేక లాభాలను పొందగలరు.

Advertisement