LOADING...
LIC Scheme: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్త టెక్ స్కీమ్‌.. రూ.1000తోనే పెట్టుబడి అవకాశం, చివరి తేదీ ఇదే!
ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్త టెక్ స్కీమ్‌.. రూ.1000తోనే పెట్టుబడి అవకాశం, చివరి తేదీ ఇదే!

LIC Scheme: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్త టెక్ స్కీమ్‌.. రూ.1000తోనే పెట్టుబడి అవకాశం, చివరి తేదీ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2026
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దీర్ఘకాలంలో స్థిరమైన మెరుగైన రాబడులు అందే అవకాశముందని నిపుణులు చెబుతుంటారు. ప్రతి వారం కొత్త కొత్త స్కీమ్స్ 'న్యూ ఫండ్ ఆఫర్'ల రూపంలో మార్కెట్‌లోకి వస్తుంటాయి. ఈ దశలో ఫండ్ యూనిట్లు తక్కువ ధరకే లభిస్తాయి. నిర్దిష్ట గడువు పూర్తయ్యాక అవి మళ్లీ సాధారణ విధానంలో కొనుగోలు, విక్రయాలకు అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడేమో ఎల్ఐసీ ఎంఎఫ్ నుంచి కొత్త NFO విడుదలైంది. దీనికి 'LIC MF టెక్నాలజీ ఫండ్' అని పేరు. ఈ ఫండ్ ప్రధానంగా టెక్నాలజీ రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టనుంది.

Details

అమ్మకాల ఒత్తిడిని ఎదర్కొంటున్న ఐటీ రంగ షేర్లు

టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలతో పాటు డేటా సెంటర్ ఆపరేటర్లు, సెమీకండక్టర్ అనుబంధ సంస్థలు, డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్, ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాలు, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టి రాబడులు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంపై ఆందోళనల మధ్య ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ రంగానికే ప్రత్యేకంగా NFO తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Details

మార్చి 6 వరకు అందుబాటులో

ఈ నెల ప్రారంభంలోనే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 10 నెలల కనిష్ఠ స్థాయిని తాకింది. ఆంత్రోపిక్ రూపొందించిన 'Claude AI' వంటి కొత్త AI టూల్స్ ఐటీ దిగ్గజాలపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు పెట్టుబడిదారుల్లో పెరిగాయి. స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల మాదిరిగానే మ్యూచువల్ ఫండ్లలో ఎన్ఎఫ్ఓ ఉంటుంది. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్త స్కీమ్ ప్రారంభించి పెట్టుబడిదారుల నుంచి నిధులు సమీకరించడాన్ని ఎన్ఎఫ్ఓగా పిలుస్తారు. ఈ LIC MF టెక్నాలజీ ఫండ్ NFO ఫిబ్రవరి 20న ప్రారంభమై మార్చి 6 వరకు అందుబాటులో ఉంటుంది.

Advertisement

Details

మార్చి 19 నుంచి మళ్లీ సాధారణ క్రయవిక్రయాలు

ఆ తర్వాత కొద్ది రోజుల విరామం అనంతరం మార్చి 19 నుంచి మళ్లీ సాధారణ క్రయవిక్రయాలకు తెరవబడుతుంది. ఇది ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. టెక్నాలజీ, టెక్‌కు అనుబంధిత కంపెనీల్లో కనీసం 80 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. మిగతా 20 శాతం వరకు ఇతర ఈక్విటీ సాధనాలు, డెట్ మరియు మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్లలో పెట్టుబడి పెట్టనుంది. అదనంగా 10 శాతం వరకు REITs, INVITs‌లోనూ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈ స్కీమ్ పనితీరుకు బెంచ్‌మార్క్‌గా BSE టెక్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ (TRI)ను ఎంచుకుంది. ఈ ఫండ్‌కు కరన్ దోషి, జైప్రకాశ్ తోష్నివాల్ ఫండ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నారు.

Advertisement

Details

గరిష్ట పరిమితి లేదు

NFO దశలో కనీసం రూ.1000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. మార్చి 19 తర్వాత రోజువారీ పెట్టుబడికి కనీసం రూ.100, నెలవారీ SIPకు రూ.200 నుంచి ప్రారంభించవచ్చు. టెక్నాలజీ రంగంలో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పెద్ద రాబడులు ఆశించే పెట్టుబడిదారులకు ఈ స్కీమ్ అనుకూల ఎంపిక అవుతుందని లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఇండియా పేర్కొంది.

Advertisement