LOADING...
Indian Banks: భారత బ్యాంకుల్లో స్థిరత్వం కోసం 'విదేశీ' వాటాలకు హద్దులు! 
భారత బ్యాంకుల్లో స్థిరత్వం కోసం 'విదేశీ' వాటాలకు హద్దులు!

Indian Banks: భారత బ్యాంకుల్లో స్థిరత్వం కోసం 'విదేశీ' వాటాలకు హద్దులు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2025
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత బ్యాంకింగ్‌ రంగంలో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా, బ్యాంకుల్లో పెద్ద వాటాదార్ల ఓటింగ్‌ హక్కులపై పరిమితులు కొనసాగించడం ద్వారా, విదేశీ పెట్టుబడిదార్లు పెద్ద మొత్తంలో వాటాలు కొనుగోలు చేసినా, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వారికి పూర్తి అధికారం లభించకూడదని చూసుకుంటోంది. ఇదే సమయంలో ఆర్థిక రంగంలో పెట్టుబడులకు సంబంధించిన నియంత్రణలను సడలించే దిశగా కొన్ని నెలలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)పలు చర్యలు తీసుకుంటోంది. దేశీయ బ్యాంకుల్లో విదేశీయులు అధిక వాటాను కొనుగోలు చేయడానికి అనుమతులు ఇవ్వబడ్డాయి. రాయిటర్స్‌ గత వారం తెలిపినట్టుగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుత స్థాయికి రెట్టింపు చేసి 49శాతానికి చేర్చే ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం ఉందని సమాచారం.

Details

ప్రస్తుత నిబంధనల ప్రకారం

ప్రైవేటు బ్యాంకులో ఒక వాటాదారుకు 26% కంటే ఎక్కువ ఓటింగ్ హక్కు ఉండదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పరిమితి 10% గా ఉంది. ఒక వాటాదారుకు 26% కన్నా ఎక్కువ వాటా ఉన్నా, ఓటింగ్ హక్కులు 26% పైగా ఉండవు. ప్రభుత్వ శాఖ, RBI చర్చల్లో, ఓటింగ్ హక్కుల పరిమితిని సరిగ్గా అమలు చేస్తే, పెద్ద వాటాదార్లకు వ్యూహాత్మక నిర్ణయాల్లో సులభంగా ఆధికారం లభించకుండా నిరోధించవచ్చని భావిస్తున్నారు. అలాగే, 26% ఓటింగ్ హక్కు పరిమితి వల్ల ఒకరు మాత్రమే నిర్ణయాధికారం కలిగి ఉండకుండా చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Details

ప్రధాన పెట్టుబడులు 

ఓటింగ్ హక్కుల పరిమితి కొనసాగించినా, భారతీయ బ్యాంకుల్లోని వ్యాపారావకాశాల కారణంగా పెద్ద విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు. ఉదాహరణకు, ఈ ఏడాది: దుబాయ్‌కి చెందిన 'Emirates NBD' ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో 60% వాటాను కొనుగోలు చేసింది. YES బ్యాంక్‌లో జపాన్‌కు చెందిన Sumitomo Mitsui Banking Corp పెట్టుబడులు పెట్టింది. IDBI బ్యాంక్లో మెజారిటీ వాటాను వచ్చే మార్చి వరకు విక్రయించాలన్న కేంద్రప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఇలా, బ్యాంకుల్లో ఓటింగ్ హక్కులపై పరిమితి కొనసాగించినా, దేశీయ మరియు విదేశీ పెట్టుబడిదార్ల ఆసక్తి బ్యాంకింగ్ రంగంలో నిలిచే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు.