Page Loader
Luo Fuli: డీప్‌సీక్‌ విజయం వెనక 'లువో' మేధస్సే కారణం.. ఆమె ఎవరంటే?
డీప్‌సీక్‌ విజయం వెనక 'లువో' మేధస్సే కారణం.. ఆమె ఎవరంటే?

Luo Fuli: డీప్‌సీక్‌ విజయం వెనక 'లువో' మేధస్సే కారణం.. ఆమె ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్‌ఏఐ వంటి ఆధునిక ఏఐ మోడళ్లకు చైనాకు చెందిన కృత్రిమ మేధ సంస్థ డీప్‌సీక్‌ గట్టి పోటీ ఇస్తోంది. అమెరికా స్టాక్ మార్కెట్‌ను ఊపేసిన ఈ చైనా స్టార్టప్‌ తన అత్యుత్తమ పనితీరు వల్ల టెక్‌ దిగ్గజాల ప్రశంసలను అందుకుంది. పరిమిత వనరులతో అభివృద్ధి చేసిన డీప్‌సీక్‌, యువ ప్రతిభావంతుల సృజనాత్మకతను నిరూపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఏఐ స్టార్టప్ విజయవంతం కావడంలో లువో ఫులి (29) కీలక పాత్ర పోషించారు. చైనాలో 'ఏఐ జీనియస్‌'గా గుర్తింపు పొందిన ఆమె, కృత్రిమ మేధ పరిశోధకురాలిగా సాంకేతిక ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

Details

అద్భుత ప్రతిభతో మెరిసిన లువో

డీప్‌సీక్‌లో కీలకమైన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌ అభివృద్ధికి ఆమె ప్రధాన బాధ్యత వహించారు. బీజింగ్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ అభ్యసించిన లువో, పెకింగ్‌ యూనివర్సిటీలో కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఏసీఎల్‌ కాన్ఫరెన్స్‌లో ఎనిమిది పరిశోధనా పత్రాలను ప్రచురిస్తూ తన మేధస్సును ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ ప్రతిభను గుర్తించిన అలీబాబా, షియామీ వంటి టెక్‌ దిగ్గజాలు ఆమెతో కలిసి పనిచేయాలని ఆసక్తి చూపాయి. అలీబాబాలోని డామో అకాడమీలో పరిశోధకురాలిగా చేరిన లువో, VECO మల్టీలింగ్వల్‌ ప్రీ-ట్రైనింగ్ మోడల్ అభివృద్ధికి నేతృత్వం వహించారు.

Details

రూ.11 కోట్లు ఆఫర్‌ చేసినా.. డీప్‌సీక్‌ను వీడని లువో

అలాగే ఓపెన్‌సోర్స్‌ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. 2022లో డీప్‌సీక్‌ బృందంలో చేరిన లువో, డీప్‌సీక్‌-V2 అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఈ ఏఐ మోడల్ చాట్‌జీపీటీ వంటి సాఫ్ట్‌వేర్‌లకు గట్టి పోటీని ఇవ్వగల సామర్థ్యాన్ని సంపాదించుకుంది. టెక్‌ ప్రపంచంలో ఆమె ప్రతిభను గుర్తించిన షియామీ ఫౌండర్‌ లీ జున్‌, రూ.11 కోట్ల భారీ ప్యాకేజీ ఆఫర్‌ చేసినా ఆమె డీప్‌సీక్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకోవడం విశేషం. ఈ విధంగా లువో ఫులి చైనాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో టెక్‌ రంగంలో తనదైన ముద్ర వేశారు.