LOADING...
Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా 
Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా

Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా 

వ్రాసిన వారు Stalin
Feb 12, 2024
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్‌బీఐ ఆంక్షల వేళ.. పేటియంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) స్వతంత్ర డైరెక్టర్ పదవికి మంజు అగర్వాల్ రాజీనామా చేశారు. వాస్తవానికి డైరెక్టర్లు షింజినీ కుమార్, మంజు అగర్వాల్ బోర్డు నుంచి వైదొలిగినట్లు గతవారమే వార్తలు వచ్చాయి. అయితే, సోమవారం మంజు అగర్వాల్ రాజీనామాను దృవీకరించినప్పటికీ, షింజినీ కుమార్ రాజీనామాపై కంపెనీ ఇంకా ఏమీ చెప్పలేదు. మంజు అగర్వాల్ రాజీనామా అంశం ప్రభావం పేటీఎం వ్యాపారంపై ఉండదని కంపెనీ తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల మంజు అగర్వాల్ ఫిబ్రవరి 1న బోర్డుకు రాజీనామా చేసినట్లు స్టాక్ మార్కెట్ల్ సమర్పించిన ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

షింజినీ కుమార్ రాజీనామాపై క్లారిటీ ఇవ్వని కంపెనీ