Mark Zucker Berg: ధనవంతుల జాబితాలో మస్క్ ను అధిగమించిన జుకర్ బర్గ్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ ను మెటా ఫ్లాట్ ఫాం ఐఎన్సీ అధినేత మార్క్ జూకర్ బర్గ్ అధిగమించారు. ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనికుల జాబితాలోకి జుకర్ బర్గ్ చేరుకున్నాడు. 2020 నవంబర్ 16 తర్వాత సంపద పరంగా ఎలన్ మస్క్ ను జుకర్ బర్గ్ అధిగమించడం ఇదే తొలిసారి. తక్కువ ఖరీదైన ఎలక్ట్రిక్ వెహికల్ కోసం ప్రణాళికలను టెస్లా విరమించుకున్నట్లు రాయిటర్స్ వార్త సంస్థ కథనం ఇచ్చిన తర్వాత టెస్లా షేర్ ధరలు బాగా తగ్గిపోయాయి. దీంతో బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో ఎలన్ మస్క్ అగ్రస్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు.
మెటా సంస్థ జోరు అందుకోవడంతోనే జుకర్ సంపద పెరుగుదల
టెస్లాకు కష్టాలు కొనసాగడంతో ఎలన్ మస్క్ సంపద తరుగుతూ వచ్చింది. ఎలన్ మస్క్ సంపద ఈ ఏడాది 48.4 బిలియన్ డాలర్ల నష్టంతో గణనీయంగా క్షీణించింది. టెస్లా వాహన డెలివరీలు మొదటి త్రైమాసికంలో క్షీణతను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు రావడంతో ఎలన్ మస్క్ ఈ ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఇక కోవిడ్ 19 మహమ్మారి కూడా ఎలన్ మస్క్ సంపద తగ్గుదల కు కారణమైంది. ఎలన్ మస్క్ సంపద తగ్గుదలకు భిన్నంగా జుకర్ బర్గ్ సంపద వృద్ధిని సాధించింది. మెటా సంస్థ జోరు అందుకోవడంతో జుకర్ బర్గ్ సంపదలో భారీ పెరుగుదల కనిపించింది. ఇది ఏడాదికి 58.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం జుకర్‌బర్గ్ నికర విలువ 186.9 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.