Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. 388 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. మరోవైపు రియాల్టీ, ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 78,509.77 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. క్రితం సెషన్‌లో ఇది 78,542.44 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి సూచీ నష్టాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో ఓ దశలో 78,048.26 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు సెన్సెక్స్ 388.19 పాయింట్లు నష్టపోయి 78,154.25 వద్ద స్థిరపడింది. అదే సమయంలో నిఫ్టీ 112.10 పాయింట్లు కోల్పోయి 24,471.70వద్ద ముగిసింది.
వివరాలు
లాభాల్లో ఐదు షేర్లు
సెన్సెక్స్ 30లో కేవలం ఐదు కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఎటర్నల్, ఇన్ఫోసిస్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
మిగిలిన ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
95.43 వద్ద రూపాయి
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.43 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ముడి చమురు ధరలు అధిక స్థాయిలోనే ఉన్నాయి.
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 89.53 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్ ధర 4,373.47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.