Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు.. భగ్గుమన్న చమురు ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ ఎగసిపడుతున్నాయి. హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్‌పై అమెరికా గడువు విధించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నౌకల రాకపోకలకు మార్గం కల్పించకపోతే, ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితుల ప్రభావంతో చమురు ధరలు పెరిగాయి. ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో బ్రెంట్ జూన్ కాంట్రాక్ట్ ధర బ్యారెల్‌కు 110.58 డాలర్లకు చేరింది. ఇది గత ముగింపు ధరతో పోలిస్తే 1.42 శాతం పెరుగుదల. అలాగే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ మే కాంట్రాక్ట్ ధర 111.90 డాలర్లకు ఎగబాకింది.
వివరాలు
నష్టాల్లో దేశీయ మార్కెట్లు
అయితే, మే నెలలో చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ దేశాలు నిర్ణయించాయి. మార్కెట్లో ధరల స్థిరత్వం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. ఈ నిర్ణయం వల్ల ధరల పెరుగుదలకు కొంత వరకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.ఉదయం 9.46 గంటల సమయంలో సెన్సెక్స్ 366 పాయింట్లు తగ్గి 72,953 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 88 పాయింట్లు పడిపోయి 22,624 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో ట్రెంట్, హిందాల్కో, కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో నిలిచాయి.
వివరాలు
రూపాయి మారకం విలువ 92.85గా నమోదు
మరోవైపు రిలయన్స్, సన్ ఫార్మా, కొటక్ మహీంద్రా, మ్యాక్స్ హెల్త్‌కేర్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా హెచ్చరికలు, ఒపెక్ ప్లస్ నిర్ణయాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇదే సమయంలో రూపాయి విలువ కాస్త పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.85 వద్ద ఉంది.