Page Loader
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. నిఫ్టీ 24,100 వద్ద ట్రేడవుతున్న సూచీలు
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. నిఫ్టీ 24,100 వద్ద ట్రేడవుతున్న సూచీలు

Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. నిఫ్టీ 24,100 వద్ద ట్రేడవుతున్న సూచీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2025
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ప్రారంభంలో లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నా, మార్కెట్లు పాజిటివ్‌ ట్రేడింగ్‌ను చూపాయి. రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి ప్రముఖ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు ముందడుగు వేస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 130 పాయింట్ల లాభంతో ప్రారంభమై, నిఫ్టీ 24,100 పైన ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఉదయం 9:25 గంటల సమయానికి, సెన్సెక్స్‌ 282 పాయింట్ల లాభంతో 79,483 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 24,092 వద్ద ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో రిలయన్స్‌ ఇండస్ట్రీ, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎటర్నల్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఎన్టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.

Details

నష్టాల్లో మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌

ఇక, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాలను చూసుకుంటున్నాయి. అమెరికా మార్కెట్లు గత ట్రేడింగ్‌ సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. డోజోన్స్‌ 0.05 శాతం, నాస్‌డాక్‌ 1.26 శాతం, ఎస్‌అండ్‌పీ 500 0.74 శాతం లాభంతో ముగిసింది. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియన్‌ ఏఎస్‌ఎక్స్‌ 0.78 శాతం లాభం రాబట్టగా, నిక్కీ 0.51 శాతం లాభంతో ట్రేడవుతుంది, కాగా హాంకాంగ్‌, షాంఘై మార్కెట్లు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.

Details

బంగారం ఔన్సు ధర 3,303 డాలర్ల వద్ద కొనసాగుతోంది

ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 63.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు ధర 3,303 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గత ట్రేడింగ్‌ సెషన్‌లో నికరంగా రూ.2,952 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,540 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.