IRCTC tour package: అజంతా, ఎల్లోరా అందాలను ఆస్వాదిద్దాం రండి..
ఇండియన్ రైల్వే టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్త టూర్ ప్యాకేజీతో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఘృశ్నేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి,అజంతా,ఎల్లోరా గుహలను చూడటానికి అవకాశం అందిస్తోంది. ప్రత్యేకంగా తక్కువ సమయంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్న వారికి ఈ ప్యాకేజీ అనుకూలంగా ఉంటుంది. ప్యాకేజీ వివరాలు: ప్యాకేజీ పేరు:"మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర"(MARVELS OF MAHARASHTRA)ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. కాచిగూడ, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నిజామాబాద్ స్టేషన్ల నుండి ఈ రైలు ఎక్కొచ్చు. యాత్ర పూర్తయ్యాక కాచిగూడలో రైలు దిగాల్సి ఉంటుంది. టికెట్ ధర..రూ.7,400 నుండి ప్రారంభం.యాత్ర వ్యవధి: మూడు రాత్రులు, నాలుగు పగళ్లు. ప్రతి శనివారం ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది.సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీలకు టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.
రైలు ప్రయాణం ఇలా..
మొదటి రోజు: సాయంత్రం 6:40 గంటలకు కాచిగూడ నుండి అజంతా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (నం: 17064) ప్రారంభమవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం. రెండో రోజు: ఉదయం 4:40 గంటలకు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోతారు. అక్కడ హోటల్‌కి తీసుకెళ్లి అల్పాహారం అందిస్తారు. తరువాత, ఎల్లోరా గుహలను సందర్శించి, ఘృశ్నేశ్వర ఆలయాన్ని దర్శిస్తారు. సాయంత్రం బీబీ కా మక్బారా (Bibi-ka-Maqbara) వీక్షిస్తారు. ఆ రాత్రి అక్కడే బస. మూడో రోజు: టిఫిన్ తర్వాత అజంతా గుహలను సందర్శిస్తారు. సాయంత్రం ఔరంగాబాద్‌కి తిరిగి చేరుకుంటారు. రాత్రి 8:00 గంటలకు రైలు (ట్రైన్ నం: 17063) ఎక్కుతారు. నాలుగో రోజు: ఉదయం 9:45 గంటలకు కాచిగూడ చేరడంతో ప్రయాణం ముగుస్తుంది.
ప్యాకేజీ ఛార్జీల వివరాలు:
ఒకరు నుంచి ముగ్గురు వ్యక్తులు బుక్ చేసుకున్నప్పుడు: కంఫర్ట్ (థర్డ్ ఏసీ బెర్త్): రూమ్ సింగిల్ షేరింగ్: రూ.22,920 ట్విన్ షేరింగ్: రూ.12,650 ట్రిపుల్ షేరింగ్: రూ.10,050 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు: విత్ బెడ్: రూ.8,630 విత్ అవుట్ బెడ్: రూ.6,890 స్టాండర్డ్ (స్లీపర్ బెర్త్): రూమ్ సింగిల్ షేరింగ్: రూ.21,440 ట్విన్ షేరింగ్: రూ.11,170 ట్రిపుల్ షేరింగ్: రూ.8,570 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు: విత్ బెడ్: రూ.7,150 విత్ అవుట్ బెడ్: రూ.5,410
నలుగు నుంచి ఆరుగురు వ్యక్తులు బుక్ చేసుకున్నప్పుడు:
కంఫర్ట్ (థర్డ్ ఏసీ): డబుల్ షేరింగ్: రూ.9,930 ట్రిపుల్ షేరింగ్: రూ.8,880 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు: విత్ బెడ్: రూ.8,630 విత్ అవుట్ బెడ్: రూ.6,890 స్టాండర్డ్ (స్లీపర్ బెర్త్): డబుల్ షేరింగ్: రూ.8,440 ట్రిపుల్ షేరింగ్: రూ.7,400 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు: విత్ బెడ్: రూ.7,150 విత్ అవుట్ బెడ్: రూ.5,410
ఇవి గుర్తుంచుకోండి..
ప్యాకేజీ ఎంపిక: ఎంచుకున్న ప్యాకేజీ ప్రకారం, రైల్లో 3 ఏసీ లేదా స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది. స్థానిక ప్రయాణం: ప్యాకేజీ ప్రకారం, స్థానిక ప్రయాణానికి ఏసీ గదులు మరియు వాహనాలు అందిస్తారు. ఆహారం,బస: ఒక్క రాత్రి బస మరియు ఒక రోజు టిఫిన్ అందించబడుతుంది. ప్రయాణ బీమా: ప్రయాణ బీమా అందించబడుతుంది. ప్రవేశ రుసుములు: పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే, సందర్శకులు స్వయంగా చెల్లించాలి.