layoffs: మే నెలలో భారీ తొలగింపులు.. సిలికాన్ వ్యాలీలో 200 ఉద్యోగాలకు పైగా కోత!
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమైంది. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ కార్యాలయాల్లో 200కంటే ఎక్కువ ఉద్యోగాలను తొలగించే ప్రణాళిక కంపెనీ తెలిపింది. ఈ వివరాలు కాలిఫోర్నియా ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించిన అధికారిక పత్రాల ద్వారా వెలుగులోకి వచ్చాయి.
Details
ఏఐపై దృష్టి, ఉద్యోగాల తొలగింపు కారణం
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ వ్యాపారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని వేగవంతం చేయాలని చూస్తున్నారు. ప్రత్యేకంగా జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తూ, ఈ రంగంలో పోటీకి నిలదొక్కుకోవడానికి ఉద్యోగాలను తగ్గించి, మిగిలిన నిధులను AI మౌలిక సదుపాయాలకు కేటాయిస్తున్నారు.
వివరాలు
ప్రభావిత కార్యాలయాలు
రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, ఈ లేఆఫ్‌లు సిలికాన్ వ్యాలీలోని వివిధ కార్యాలయాల్లో జరగనున్నాయి. బర్లింగేమ్ (Burlingame) కార్యాలయంలో 24 పోస్టులను తొలగించడం. సన్నీవేల్ (Sunnyvale)లో సుమారు 74 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇవ్వడం. గత నెలలో మెటా సేల్స్, రిక్రూటింగ్, రియాలిటీ ల్యాబ్స్ హార్డ్‌వేర్ విభాగాల్లో మార్పులు జరిగిందని, వీటికి ఈ లేఆఫ్‌లకు సంబంధముందని ఫాక్స్ బిజినెస్ నివేదిక తెలిపింది. అయితే కొంతమంది ఉద్యోగులు మిగతా విభాగాల్లో మళ్లీ అవకాశాలు పొందగలరని కంపెనీ తెలిపింది.
వివరాలు
అధికార ప్రతినిధి వ్యాఖ్య
లక్ష్యాలను సాధించడానికి బృందాలు అత్యుత్తమ స్థితిలో ఉండేలా పునర్వ్యవస్థీకరణలు, మార్పులను అమలు చేస్తూ ఉంటాయి. ఎక్కడైతే వీలవుతుందో ప్రభావిత ఉద్యోగులకు ఇతర అవకాశాలను కల్పిస్తున్నామని మెటా ప్రతినిధి తెలిపారు. లేఆఫ్ తేదీలు బర్లింగేమ్: మే 22 సన్నీవేల్: మే 29 ఏఐలో భారీ పెట్టుబడులు గత కొన్ని సంవత్సరాలుగా మెటా తన పూర్తి దృష్టిని AI వైపుకు మళ్లించగా, AI మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. 2026లో ఏఐ, ఇతర అవసరాల కోసం మెటా మూలధన వ్యయాన్ని దాదాపు 135 బిలియన్ డాలర్ల వరకు పెంచనుంది.
వివరాలు
గత లేఆఫ్‌ల చరిత్ర
2022 నవంబర్‌లో మెటా చరిత్రలో అతిపెద్ద లేఆఫ్: 11,000 మందిని తొలగించింది (13% ఉద్యోగులు) ఆ తర్వాత నాలుగు నెలల్లో మరో 10,000 మందిని తొలగింపు తాజాగా ఏఐ సాంకేతికతలో గూగుల్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలతో పోటీ పడటానికి మెటా అగ్రశ్రేణి AI పరిశోధకులను భారీ ప్యాకేజీలతో ఆకర్షిస్తోంది.