మెటా కొత్త ప్లాన్: ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో యాడ్స్ ఉండవు
యూరప్‌కి చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో యూజర్ల కోసం మెటా సరికొత్త ప్లాన్‌తో వస్తుంది. ఇకపై ఫేస్ బుక్, ఇన్‌స్టాలో యాడ్స్ రాకుండా చేయవచ్చు. దానికోసం యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కోసం నెలకు రూ.1,165 చెల్లించాల్సిన అవసరం ఉంటుందట. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం రాసుకొచ్చింది. వాల్ స్ట్రీట్ కథనం ప్రకారం, డెస్క్ టాప్ వెర్షన్ లో ఫేస్ బుక్, ఇన్‌స్టా సబ్ స్క్రిప్షన్ పొందాలనుకుంటే, యూరోపియన్ యూజర్లు నెలకు 870రూపాయలు చెల్లించాల్సి ఉంటుందట. అడిషనల్‌గా మరొక అకౌంట్ వాడాలనుకుంటే మరొక 6పౌండ్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందట.
మొబైల్ డివైజ్‌లో సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రత్యేక రేటు
గూగుల్ యాప్ స్టోర్స్, ఆపిల్ ఆప్ స్టోర్స్ కలిగి ఉన్న మొబైల్ డివైజుల్లో ఫేస్ బుక్, ఇన్‌స్టా సబ్ స్క్రిప్షన్ కావాలనుకుంటే 1,130రూపాయలు చెల్లించాల్సి ఉంటుందట. మెటా పరిచయం చేస్తున్న కొత్త యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు వచ్చే అవకాశం ఉందని మెటా తెలియజేస్తుంది. యూరప్ లో 258 మిలియన్ల ఫేస్ బుక్ యూజర్లు ఉన్నారని అంచనా. అలాగే 257మిలియన్ల మంది ఇన్స్ టా యూజర్లు ఉన్నారని అంటున్నారు. యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ వల్ల మెటా తాలూకు అడ్వర్టైజింగ్ ఆదాయంపై ప్రభావం పడుతుంది.